Watch Video: వాలెంటైన్స్‌ డే రోజున ప్రియుడితో భార్య.. భర్త చేసిన పనికి అందరూ షాక్

ప్రేమికుల రోజున ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో ఉండటాన్ని ఆమె భర్త చూశాడు. నడిరోడ్డుపైనే ఈ ముగ్గురు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Man Catches Wife With Her Lover On Valentines Day in Uttarpradesh

Man Catches Wife With Her Lover On Valentines Day in Uttarpradesh

ప్రేమికుల రోజున ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో ఉండటాన్ని ఆమె భర్త చూశాడు. నడిరోడ్డుపైనే ఈ ముగ్గురు కొట్టుకున్నారు. సమాచారం మేరకు అక్కడికి వచ్చిన పోలీసలు వాళ్లని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని హాపూర్‌లో శనివారం వాలెంటైన్స్‌ డే సందర్భంగా ప్రియుడి బైక్‌పైన భార్య ఉండటాన్ని భర్త గమనించాడు. 

Also Read: ఢిల్లీ పేలుళ్ల కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

రోడ్డుపై వాళ్లని అడ్డుకున్నాడు. దీంతో ఈ ముగ్గురి మధ్య చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకున్నారు. అక్కడున్న స్థానికులు వాళ్లని చూసి షాకైపోయారు. చివరికి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు వాళ్లని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై శాంతికి భంగం కలిగించిన కారణంగా మహిళ భర్త, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. తొలి రోడ్డు-రైలు సొరంగానికి ఆమోదం

Advertisment
తాజా కథనాలు