/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ బాలిక కాలువలో పడి దుస్తులు మురికి కావడంతో ఆమె తండ్రి, సవతి తల్లి చేసిన దారుణానికి ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ అసలేం జరిగిందో ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లో జనవరి 11న షిఫా అనే ఆరేళ్ల బాలిక తోటి పిల్లలతో ఇంటి బయట వీధిలో ఆడుకుంటుంది. అలా ఆడుకుంటుండగా షిపా కాలువలో పడిపోయింది. ఆమె దుస్తులు మురికి కావడంతో తండ్రి అక్రమ్, సవతి తల్లి నిషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: NTVపై సీఎం రేవంత్ సీరియస్.. లైసెన్స్ రద్దు చేయాలంటూ ఆదేశం
ఆ చిన్నారిని దారుణంగా కొట్టారు. రాత్రంతా చలిలో టెర్రస్‌పై వదిలిపెట్టారు. దీంతో ఆ చిన్నారి అక్కడే మరణించింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ చిన్నారి ఎముకలు విరిగిపోయాయని.. రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. ఆమె శరీరంపై 13 గాయాలున్నట్లు కూడా చెప్పారు. అక్రమ్ మొదటి భార్యకు ఆ బాలిక జన్మించింది. ఆమె కొట్టి చంపిన తండ్రి అక్రమ్, సవతి తల్లి నిషాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us