Viral News: శోభనం రాత్రే తండ్రైన పెళ్లికొడుకు.. షాక్ అయిన బంధువులు!

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెడితే ఆ సంబరమే వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లయిన తొలిరాత్రే వధువు తల్లి కావడంతో ఇరు కుటుంబాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.

New Update
first night

ఉత్తరప్రదేశ్‌(uttarpradesh) లోని రాంపూర్ జిల్లా అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెడితే ఆ సంబరమే వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లయిన తొలిరాత్రే (శోభనం రాత్రి(first night)) వధువు తల్లి కావడంతో ఇరు కుటుంబాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.

Also Read: రౌడీ హీరో సినిమా ‘రణబాలి’ పై AI ఎఫెక్ట్.. డైరెక్టర్ ఏమన్నాడంటే..?

వివరాల్లోకి వెళ్తే.. అజీమ్‌నగర్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో ఇటీవలే వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే, పెళ్లి ముగిసి తొలిరాత్రి గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే వధువు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక మహిళా వైద్యురాలిని పిలిపించారు. పరీక్షించిన డాక్టర్.. అది సాధారణ కడుపునొప్పి కాదని, వధువు గర్భవతి అని, ఆమెకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో వైద్యురాలు ఇంట్లోనే కాన్పు చేశారు. రాత్రి మొదలైన నొప్పులు తెల్లవారేసరికి పండంటి ఆడబిడ్డ జననంతో ముగిశాయి. వధువు గర్భవతి అన్న విషయం పెళ్లికి ముందు ఎవరికీ తెలియకపోవడంతో మొదట వరుడు, అతని కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అయితే, వారు ప్రేమించుకున్న విషయాన్ని, ఆ సంబంధం వల్లనే గర్భం దాల్చిన విషయాన్ని అర్థం చేసుకున్న వరుడు.. తండ్రైన ఆనందంలో మునిగిపోయాడు. - Groom becomes father

Also Read: రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ట్రెండ్.. అసలు నిజం ఏంటి? వైరల్ అవుతున్న కథ వెనక వాస్తవం ఇదే!

హ్యాపీ ఎండింగ్

సాధారణంగా ఇలాంటి సమయాల్లో గొడవలు జరుగుతుంటాయి, కానీ ఇక్కడ వరుడు, అతని కుటుంబం పుట్టిన బిడ్డను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఇంట్లో ఎలాంటి గొడవలు పడకుండా కొత్త అతిథి రాకను వేడుకలా జరుపుకున్నారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సమాచారం అందుకున్న అజీమ్‌నగర్ పోలీసులు స్పందిస్తూ.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఇది ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. - viral news telugu

Advertisment
తాజా కథనాలు