Crime: ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దన్నారని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్

ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ను అనేకమంది విచ్చలవిడిగా వాడుతున్నారు. కొందరు పిల్లలు, యవతీయువకులైతే ఏకంగా వాటికి బానిసలుగా మారుతున్నారు. అయితే ఓ ఇంట్లో ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడొద్దని అన్నందుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్‌ చేసుకోవడం కలకలం రేపింది.

New Update
Crime

Crime

ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ను అనేకమంది విచ్చలవిడిగా వాడుతున్నారు. కొందరు పిల్లలు, యవతీయువకులైతే ఏకంగా వాటికి బానిసలుగా మారుతున్నారు. అయితే ఓ ఇంట్లో ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడొద్దని అన్నందుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్‌ చేసుకోవడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌లో ఓ ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు ఉంటున్నారు. 12, 14,16 ఏళ్ల వయసున్న ఈ అక్కాచెల్లిళ్లకు కరోనా సమయంలో ఫోన్ చూడటం అలవాటయ్యింది. 

Also Read: భారత్‌ అమ్ముల పొదిలో మరో ఆయుధం..‘ఎస్‌ఎఫ్‌డీఆర్‌’ పరీక్ష విజయవంతం

ఆ తర్వాత వీళ్లు ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అయిపోయారు. కనీసం స్కూల్‌కు వెళ్లడం కూడా మానేశారు. దీంతో వారి తల్లిదండ్రులు ఫోన్ వాడకాన్ని తగ్గించాలని, ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దంటూ పిల్లలను మందలిస్తుండేవారు. మంగళవారం రాత్రి కూడా ఈ విషయంపైనే ఇంట్లో గొడవ జరిగింది. ఆ తర్వాత ఈ ముగ్గురు తోబుట్టువులు టౌన్‌షిప్‌లోని 9వ అంతస్తు పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. 

Also Read: బాబు పడ్డాడని చెప్పి డ్రైనేజీ మొత్తం క్లీన్ చేయించింది..వీడియో వైరల్!

అందరూ నిద్రిస్తున్న సమయంలో భారీ శబ్ధం రావడంతో అక్కడి స్థానికులు వారిని చూసి కంగుతిన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని గుర్తించిన ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటిదాకా ఎలాంటి సూసైడ్ నోట్‌ లభించలేదని పోలీసులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు