Floods: భారీ వరదల్లో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. 10 మంది గల్లంతు.. వీడియో
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే మంగళవారం దెహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ నది దాటేందుకు ప్రయత్నిస్తుండగా వరద ఉద్ధృతి పెరగడంతో ప్రమాదవశాత్తు బోల్తాపడి కొట్టుకుపోయింది.