/rtv/media/media_files/2025/12/31/fotojet-58-2025-12-31-10-09-01.jpg)
chamoli-train-accident
Chamoli Train Accident : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం(accident-case) జరిగింది. చమోలీ జిల్లాలోని విష్ణుగడ్-పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో మంగళవారం అర్దరాత్రి రెండు లోకో రైళ్లు(loco-pilot) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది గాయడ్డారు. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో జరిగిన ఈ ఘటనలో 60 మంది గాయపడ్డారు (Loco Train Collide In Uttarakhand). ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read : సోఫాలోంచి లేస్తుండగా పేలిన గన్.. ఎన్నారై మృతి
Chamoli Train Accident
చమోలీ జిల్లాలోని విష్ణుగడ్–పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో మంగళవారం అర్దరాత్రి రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి(train-accident). ప్రాజెక్టు నిర్మాణం కోసం కార్మికులు, అధికారులు ప్రయాణిస్తున్న లోకో రైలు, నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న మరో లోకో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది గాయడ్డారు.మంగళవారం రాత్రి 9:30 గంటలకు షిఫ్ట్ మార్పు సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ పేర్కొన్నారు. సొరంగం లోపలికి కార్మికులను, అధికారులను తీసుకెళ్తున్న రైలు.. పరికరాలను తీసుకెళ్తున్న మరో రైలును ఢీకొట్టినట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో రైలులో 109 మంది ఉన్నారని.. వారిలో 70 మంది గాయపడ్డారన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు ప్రారంభించామని ఎస్పీ సూర్జిత్ సింగ్ పన్వర్ పేర్కొన్నారు. . రైళ్లలో ఉండిపోయిన అందర్నీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని వెల్లడించారు. కాగా, తీవ్రంగా గాయపడిన 10 మందిని గోపేశ్వర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మిగిలిన వారికి ప్రాజెక్టు పరిధిలోనే ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తామని పేర్కొన్నారు. సొరంగం నుంచి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని వెల్లడించారు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది ఝార్ఖండ్, ఒడిశాకు చెందినవారుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు స్థానిక యంత్రాంగం ఆదేశించింది. ఘటన సమయంలో భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థలో ఏదైనా లోపం ఉందా అనే కోణంలో విచారించనున్నట్లు తెలుస్తోంది.
చమోలీ జిల్లాలో హెలాంగ్ – పిపల్కోటి మధ్యలో అలకనంద నదిపై జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నాలుగు టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టున్నట్లుగా అధికారులు తెలిపారు.
Also Read : ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!
Follow Us