Uttarakhand Cloud Burst: మళ్ళీ ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు..పలువురు గల్లంతు

ఉత్తరాఖండ్ లో మరోసారి కుంభవృష్టి కురిసింది. దీంతో మెరుపు వరదలు చమోలీ జిల్లా మెరుపు వరదల్లో మునిగిపోయింది. సగ్వారా గ్రామంలో ఒక యువతి చనిపోగా..పలువురు గల్లంతయ్యారు. 

New Update
chamoli

cloudburst struck in Chamoli

Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్ ను వరుసపెట్టి మెరుపు వరదలు ముంచెత్తుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతోంది.  చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి కుంభవృష్టి కురిసింది. దీంతో చాలా నివాసాలు వరద నీటిలో మనిగిపోయాయి. సత్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద ఉండిపోయి..ప్రాణాలు కోల్పోయింది. దీంతో పాటూ పలువురు గల్లంతయ్యారు. 

Also Read: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్‌ సేవలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

సహాయక చర్యలు ముమ్మరం..

వరదల సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. ముమ్మరం సహాయక చర్యలు చేపట్టాయి. వరద నీరు, ఇళ్ళల్లో చిక్కుకున్న స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌  సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఎక్స్‌ వేదికగా స్పందించారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. 

Also Read: స్నేహితుడు సినిమా రిపీట్.. వైద్యుడి వీడియో కాల్‌తో ఇంట్లోనే భార్యకు ప్రసవం చేసిన భర్త

Also Read:BANK JOBS: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 750 బ్యాంక్ జాబ్స్‌కు నోటిఫికేషన్!

అంతకు ముందు ఇదే నెల మొదట్లో ఆగస్టు 5వ తేదీన ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ ధారాలీ అనే గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో గంగోత్రీలోని ధరావలి గ్రామంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా బురద రావడంతో ధరావలి గ్రామం మొత్తం బురదకు కొట్టుకుని పోయింది. ఇళ్లు, హోటళ్లు ఇలా కొండకి ఆనుకుని ఉన్న అన్ని కూడా నేలమట్టమయ్యాయి. ఈ భారీ బురద వల్ల నలుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గల్లంతయ్యారు. వీరితో పాటూ 11 మంది సైనికులు కూడా గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇప్పటి వరకూ దొరకనే లేదు. 

Advertisment
తాజా కథనాలు