Cloud Burst: అది క్లౌడ్ బరస్ట్ కాదేమో..ఉత్తరాఖండ్ లో వరదలపై శాస్త్రవేత్తల అనుమానం

ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో ఉన్నట్టుండి ముంచుకొచ్చిన వరదలపై వాతావరణశాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కు కారణమయ్యేంత వర్షపాతం అక్కడ నమోదు కాలేదని చెబుతున్నారు. దీనిపై మరింత పరిశోధన జరగాలని చెబుతున్నారు. 

New Update
Uttarakhand floods

ఉత్తరాఖండ్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. వీరి కారణంగా ఉత్తరకాశీలో ధరాలీ అనే ఊరు మొత్తం కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతానికి ఎగువనున్న ఖీర్ గంగానది ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణమని ఇప్పటి వరకూ అందరూ భావిస్తున్నారు. అయితే వాతావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు మాత్రం దీని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  క్లౌడ్ బరస్ట్ అయ్యేంతగా అక్కడ వర్షం కురవలేదని చెబుతున్నారు.

అంత తక్కువ వర్షానికి వరదలు రావు..

మంగళవారం ఉత్తరకాశీలో 27 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీని వలన అంత అకస్మాత్తుగా వరదలు సంభవించే అవకాశం లేదని అంటున్నారు. వాతావరణ శాఖ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అక్కడ క్లౌడ్ బరస్ట్ కు సంబంధించిన సమాచారం లేదు. అందుకే ముందు జాగ్రత్తలు కూడా తీసుకోలేకపోయారని ఐఎండీ శాస్త్రవేత్త రోహిత్‌ తప్లియాల్‌ చెప్పారు. దీనిపై మరింత పరిశోధనలు జరగాలని...అప్పుడే ఏ విషయం నిర్ధారించగలమని అన్నారు. ఓ గంట వ్యవధిలో 100 మి.మీ వర్షపాతం నమోదైతేనే క్లౌడ్ బరస్ట్ అనగలము. కానీ ఆ రోజు అక్కడ కురిసింది కేవలం 27 మి.మీ మాత్రమే అని తెలిపారు. 

హిమాలయాల్లో బురద కూడా కారణం?

మరోవైపు వర్షంతో పాటూ ఎంత ఎత్తు నుంచి బురద వచ్చిందనేది కూడా వరదలకు కారణం అవుతుంది. మంచు కొండలు కరిగిపోవడం, ప్రవాహ మార్గం ఇరుకుగా ఉండటం కూడా ఆకస్మిక వరదలకు కారణమవుతుందని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయా జియాలజీ మాజీ శాస్త్రవేత్త డీపీ డోభాల్‌ అంటున్నారు. ఇది తెలియాలంటే శాటిలైట్ ఫోటోలు, వీడియోలను పరిశీలించాలి. దీని కోసం ఇప్పటికే ఇస్రోను సంప్రదించామని తెలిపారు. 

కొనసాగుతున్న అన్వేషణ..

ఇక ధరాలీ వరదల్లో కొట్టుకుపోయిన 11 మంది సైనికులతో సహా మిగతా వారి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ధరాలీకి వెళ్ళే రోడ్లన్నీ మూసుకుపోయాయి. ఇళ్ళు, హోటళ్ళు అన్నీ కొట్టుకుపోయాయి.  చాలా మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. 3 బృందాలు ధరాలీలో గాలిస్తున్నారు. ఇప్పటివరకు 2 మృతదేహాలను మాత్రమే వెలికితీయలిగారు.

Also Read: Racist Attack: ఐర్లాండ్ లో మితిమీరిన జాత్యాహంకారం..ఆరేళ్ల ఇండియన్ బాలిక ప్రైవేట్ పార్ట్ లపై దాడి

Advertisment
తాజా కథనాలు