Floods: భారీ వరదల్లో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌.. 10 మంది గల్లంతు.. వీడియో

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే మంగళవారం దెహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ నది దాటేందుకు ప్రయత్నిస్తుండగా వరద ఉద్ధృతి పెరగడంతో ప్రమాదవశాత్తు బోల్తాపడి కొట్టుకుపోయింది.

New Update
Marooned Men Were Waiting For Help in Uttarkhand

Marooned Men Were Waiting For Help in Uttarkhand

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే మంగళవారం దెహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ నది దాటేందుకు ప్రయత్నిస్తుండగా వరద ఉద్ధృతి పెరగడంతో ప్రమాదవశాత్తు బోల్తాపడి కొట్టుకుపోయింది. ట్రాక్టర్‌లో ఉన్న 10 మంది వరదలో గల్లంతవ్వడం కలకలం రేపింది. స్థానికులు వాళ్లని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. 

Also Read: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడిపై ఇస్లాం దేశాల సీరియస్.. రక్త దాహాన్ని అడ్డుకోవాలని తీర్మానం

వరద ప్రభావానికి ఆ నదిలో కొట్టుకుపోయిన వాళ్లందరూ కూలీలేనని అధికారులు తెలిపారు. వాళ్ల ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చెప్పారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరో ప్రాంతంలో స్వర్ణ నదికి దగ్గర్లో కూడా వరదలు పోటెత్తడంతో అక్కడ  ఓ చిన్నారి చిక్కుకున్నాడు

నదిలో కొట్టుకుపోయిన వారంతా కూలీలని.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మరో ప్రాంతంలో స్వర్ణ నదికి సమీపంలో వరదల్లో చిక్కుకున్న ఓ బాలుడిని  ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి. ఇదిలాఉండగా ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో దెహ్రాదూన్‌తో సహా ముస్సోరీ మాల్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. 

Also Read: గాజాలో మారణహోమం.. టార్గెట్‌ నెరవేరేవరకు వదలమంటున్న ఇజ్రాయెల్

దీంతో చాలామంది వరదల్లో చిక్కుకుపోయారు. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్‌ ఇప్పటిదాకా 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరదలపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌ సింగ్ ధామి కూడా స్పందించారు. 25 నుంచి 30 చోట్ల రోడ్లు తెగిపోయాయని పేర్కొన్నారు. ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  

Advertisment
తాజా కథనాలు