/rtv/media/media_files/2026/02/07/uttarakhand-2026-02-07-07-58-04.jpg)
51,000 rupees Reward For Alcohol-Free Weddings In Uttarakhand
ఈ మధ్యకాలంలో ఎలాంటి వేడుకలు జరుపుకున్న అందులో మద్యపానం తప్పనిసరిగా ఉంటుంది. ఇక వివాహ వేడుకల్లో అయితే విచ్చలవిడిగా మద్యం తాగుతారు. తాగిన మైకంలో కొందరు మితిమీరి ప్రవర్తించడం వల్ల ఇలాంటి వేడుకల్లో గొడవలు జరిగిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకల్లో మద్యం వినియోగాన్ని కట్టడి చేసేందుకు ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామ సర్పంచ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మద్యం పంపిణీ చేయకుండా పెళ్లిళ్లు జరిపించే కుటుంబాలకు రూ.51 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు.
Also Read: కెనడాలో దారుణం.. 17 మంది భారతీయ విద్యార్థులు మృతి
ఇక వివరాల్లోకి వెళ్తే డోయీవాలా నియోజకవర్గంలోని గడుల్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామ సర్పంచ్ అయిన స్వీట్ రావత్ అనే మహిళ వివాహ వేడుకల్లో మద్యపానాన్ని అరికట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసమే వినూత్నంగా ఓ ఆఫర్‌ను తీసుకొచ్చారు. మద్యం లేకుండా పెళ్లి జరిపే కుటుంబాలకు రూ.51 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటిదాకా రెండు కుటుంబాలు ఈ నిబంధన పాటించగా ఆ కుటుంబాలకు నగదును అందజేశారు. శుభకార్యకాలకు మద్యం పంపిణీ చేయడం వల్ల డబ్బు వృథాగా ఖర్చు అవుతుందని.. యువత మద్యానికి బానిస అయ్యేందుకు కారణమవుతోందని స్వీటీ తెలిపారు. దీన్ని అరికట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: ఆన్‌లైన్‌లో డబ్బులు పోగట్టుకున్న వారికి గుడ్‌న్యూస్.. వారికి బ్యాంక్ నుంచి రూ.25వేలు
ప్రజల నుంచి కూడా తన సపోర్ట్ వస్తోందని చెప్పారు. ఆమె చేస్తున్న ప్రయత్నానికి అక్కడి జిల్లా కలెక్టర్ సహా పలువురు ప్రశంసించారు. గతంలో కూడా ఉత్తరాఖండ్‌లోనే తెహ్రి అనే జిల్లాలో ఇలాంటి ప్రయత్నమే జరిగింది. దేవ్‌ప్రయాగ్ అనే గ్రామంలో పెళ్లి వేడుకను మద్యపానం లేకుండా జరిపితే వధువుకు రూ.10 వేల నగదు బహుమతి ఇస్తామని స్థానిక పోలీసులు ఆఫర్ పెట్టారు. ఈ డబ్బును స్థానిక పోలీసులే విరాళంగా తమవంతు జమ చేసి ఇస్తున్నారు.
Follow Us