BIG BREAKING: ఉత్తరాఖండ్లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్.. మునిగిన డెహ్రాడూన్

మంగళవారం తెల్లవారు ఝామున కురిసిన భారీ వర్షానికి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఇళ్ళు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.

New Update
dehradun

Cloud Burst In Dehradun

ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. నిన్నటి నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు ఈ రోజు తెల్లవారు ఝామున భారీ వర్షం పడింది. దీంతో డెహ్రాడూన్ లో వరదలు సంభవించాయి. అక్కడ ఇళ్ళు, దుకాణాలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యాయి. దీంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులను కాపాడేందుకు రెస్క్య టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. 

అన్ని స్కూళ్ళకు సెలవు

వరద ప్రాంతాలకు ఇప్పటికే జిల్లా మేజిస్ట్రేట్ సవిన్ బన్సాల్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కుంకుమ్ జోషి, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు. దాంతో పాటూ డెహ్రాడూన్ లో 1 నుంచి 12 వ తరగతి వరకు అన్ని స్కూళ్ళకు సెలవులను ప్రకటించారు. 

Advertisment
తాజా కథనాలు