BIG BREAKING : నలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్
అల్‌ఖైదాతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. గుజరాత్ లో ఇద్దరు ఢిల్లీ, నోయిడాలో చెరకోరు అరెస్ట్ అయ్యారు.
అల్‌ఖైదాతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. గుజరాత్ లో ఇద్దరు ఢిల్లీ, నోయిడాలో చెరకోరు అరెస్ట్ అయ్యారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బైసరన్ లోయలో ఉగ్రవాదులు గాల్లోకి తూటాలు పేల్చి సంబరాలు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.
అమెరికాలో 8 మంది భారతీయులను అక్కడ అధికారులు హింస, కిడ్నాప్ కేసుల్లో వారిని అరెస్టు చేశారు. వీరిలో జాతీయ దర్యాప్తు సంస్థ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలా ఉన్నాడు. ఇతనికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
ప్రముఖ యాంకర్, కమెడియన్ కపిల్ శర్మపై కాల్పులు జరిగాయి. కెనడాలో కపిల్ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ KAP'S CAFE పై గుర్తుతెలియని దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. ఫైరింగ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఉగ్రవాద సంస్థలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. దాడులు చేయడానికి డిజటల్ పే, ఈ కామర్స్ ల ద్వారా మనీ సేకరిస్తున్నాయి అని చెబుతోంది ఎఫ్ఏటీఎఫ్. పుల్వామా దాడే ఇందుకు ఉదాహరణ అని చెబుతోంది.
పాకిస్తాన్ కు టెర్రరిజానికి ఉన్న సంబంధాలు మళ్ళీ మళ్ళీ బయటపడుతున్నాయి. తాజాగా మరో సారి ఈ విషయం బహిర్గతమైంది. పాకిస్తాన్ లోని పంజాబ్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, లష్కరే తోయిబా చీఫ్ కుమారుడుతో వేదికను పంచుకున్నారు.
తమకు, ఉగ్రవాదానికి ఏం సంబంధం లేదంటూ పాకిస్తాన్ బుకాయిస్తూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆ దేశమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందనే ఆధారాలు దొరుకుతూనే ఉన్నాయి. తాజాగా ఉగ్రవాదులు, పాకిస్తాన్ మంత్రులూ కలిసి ఒకే వేదికను పంచుకున్న ఫోటో ఒకటి బయటపడింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భద్రతా దళాలు, తెహ్రిక్-ఇ తాలిబన్ మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఉగ్రవాదులు..పోలీసుల మీదకు హ్యాండ్ గ్రనేడ్లు విసరడంతో పాటూ తమను తాము కాల్చుకున్నారు. ఇందులో ఇద్దరు పోలీసులతో పాటూ తిరుగుబాటు నాయకుడు జర్నోష్ నసీమ్ కూడా మృతి చెందాడు.
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు లొంగిపోయారు. ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలామ్ లొంగిపోయారని షోపియాన్ పోలీసులు ప్రకటించారు. వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 102 రౌండ్స్, 2 హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.