/rtv/media/media_files/2025/12/02/bsf-2025-12-02-09-43-29.jpg)
పహల్గాం దాడి(Pahalgam attack) తరువాత పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్(operation Sindoor) పేరుతో దాడి చేసింది. దాదాపు చాలా ఉగ్రవాద శిబిరాలను పడగొట్టింది. ఈ సమయంలో పాకిస్తాన్, భారత్ కు మధ్య నాలుగు రోజులు పాటూ యుద్ధం జరిగింది. ఆ తరువాత రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి కాల్పులు విరమణ చేశాయి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు కూడా కాస్త తగ్గాయి. కానీ ఢిల్లీ బాంబ్ బ్లాస్టర్ తో మళ్ళీ ఉగ్రవాదులు(terrorists) రెచ్చిపోయారు. తీగ లాగితే డొంక కదిలినట్టు దీని తరువాత చాలా మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో భారత బోర్డర్ ఎల్వోసీ చుట్టూ ఉగ్రవాదులు వేచి ఉన్నారని బీఎస్ఎఫ్ అధికారి చెబుతున్నారు.
Also Read : విచ్చలవిడి శృంగారం.. అడ్డు అదుపులేని లైంగిక సంబంధాలతో..ఎయిడ్స్ విజృంభన
ఎనిమిది ఉగ్రవాదులను మట్టుబెట్టాం..
పాకిస్తాన్ ఎల్వోసీవెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు, 100 నుంచి 120 మంది దాకా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడడానికివేచి ఉన్నారని బీఎస్ఎఫ్ ఇనెస్పెక్టర్ జనరల్ యాదవ్ చెప్పారు. సరిహద్దు భద్రతా దళంలోని జి బ్రాంచ్ ఈ ఉగ్రవాద స్థావరాలపై నిఘా ఉంచిందని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రత పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. 2025 ఏడాది మొత్తంలో నాలుగు సార్లు ఎనిమిది మంది ఉగ్రవాదులు చొరబాటుకుప్రయత్నించారని..కానీ బీఎస్ఎఫ్ వారిని మట్టుబెట్టిందని ఇనెస్పెక్టర్ జనరల్ యాదవ్ తెలిపారు. ఉగ్రవాద గ్రూపులు మరియు వాటి క్యాడర్ల కదలికలు మరియు కార్యకలాపాలపై నిఘా సమాచారాన్ని అందించడంలో బిఎస్‌ఎఫ్ యొక్క జి బ్రాంచ్ ప్రధాన పాత్ర పోషించిందని యాదవ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎల్ఓసీ అంతటా అనేక ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లు ధ్వంసమయ్యాయి, అయితే ఉగ్రవాదుల ఉనికి ఉన్న చోట కొన్ని లాంచింగ్ ప్యాడ్‌లు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఆపరేషన్ సింధూర్ మాత్రం బీెస్ఎఫ్కు అతి పెద్ద విజయమని యాదవ్ అన్నారు. భారత సైన్యంతో కలిసి BSF యూనిట్లు నియంత్రణ రేఖ వెంట పాక్ పోస్టులు మరియు ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లపై సమర్థవంతంగా కాల్పులు జరిపాయని చెప్పుకొచ్చారు.
Also Read: Elon Musk: నా భార్యకు భారతీయ మూలాలు, కోడుకు పేరు అశోక్..ఎలాన్ మస్క్
Follow Us