India-Pak: భారత్‌లోకి 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం..
మే 8న 45-50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్ దళాలు యత్నించాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది. దీనికోసం భారీగా షెల్లింగ్ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి.
మే 8న 45-50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్ దళాలు యత్నించాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది. దీనికోసం భారీగా షెల్లింగ్ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. ఆమెకు అన్నే తెలిసే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులతో మాత్రం సంప్రదింపులు కొనసాగించిందని అంటున్నారు.
పాకిస్థాన్‌లో ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్‌లో అనుమానిత డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారని.. వాళ్లందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లని పేర్కొన్నారు.
ఇండియా, పాకిస్థాన్ యుద్దం తానే ఆపానంటూ చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తున్నాడు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నవారికి వైట్‌హౌజ్‌లో కీలక పదవులు కట్టబెట్టి మరోసారి ద్రోహానికి పాల్పడ్డారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. తాజాగా షోపియాన్ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. వారినుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.
పాకిస్తాన్ లో ఎలాంటి మార్పు రాలేదు. కుక్క తోక వంకరే అన్నట్లుగా వ్యవహారిస్తోంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసాయం చేసేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ధ్వంసం అయిన ఉగ్రవాద స్థావరాల పునర్నిర్మాణం చేసే బాధ్యతలను తన భుజాలపై ఎత్తుకోబోతుంది.
జమ్మూ, కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భారత్ భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఇక్కడే కాల్పులు జరగ్గా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. 48 గంటల్లో ఇది రెండో ఎన్ కౌంటర్.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపం మరోమారు బహిర్గతమైంది. దీన్ని ఆధారాలతో ప్రపంచం ముందుంచింది భారత్. ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన తీవ్రవాదులకు పాక్ సైన్యం, ఉగ్రవాదులు సంయుక్తంగా నివాళులు అర్పిస్తున్న వీడియోలను బయటపెట్టింది.