/rtv/media/media_files/2025/12/11/pakistan-boat-2025-12-11-17-46-50.jpg)
పాకిస్తాన్ నుంచి భారత్ కు ఉగ్రవాదులు రావొచ్చనే అనుమానాలను భారత నిఘా సంస్థలు వ్యక్తం చేశాయి. దేశంలోకి ప్రవేశించడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు గుజరాత్ లోని కచ్ తీరంలో పట్టుబడ్డ ఓ పడవ కలకలం రేపింది. ఇందులో మొత్తం 11 మందిని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తామంతా మత్స్యకారులమని వారు చెబుతున్నారు. దారి తప్పి ఇటు వచ్చామని తెలిపారు. అయితే దొరికిన వారు ఉగ్రవాదులు కూడా అయ్యే ఛాన్స్ ఉందని పోలీసులు అంటున్నారు. మారు వేషంలో దేశంలోకి ప్రవేశించడానికి చస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్నామని..ఉగ్రవాద కోణంలో విచారిస్తున్నామని చెబుతున్నారు.
Kutch, Gujarat | Eleven Pakistani fishermen were caught entering Indian waters near Jakhau without permission. The Indian Coast Guard arrested the Pakistani fishermen along with a boat named 'Al Wali'. All of them were brought to Jakhau Port along with the boat. The search of the… pic.twitter.com/SpcOZOEp0F
— ANI (@ANI) December 11, 2025
భారత్ లో ఉగ్రదాడి..నిఘా వర్గాల హెచ్చరిక
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు కూడా కాస్త తగ్గాయి. కానీ ఢిల్లీ బాంబ్ బ్లాస్టర్ తో మళ్ళీ ఉగ్రవాదులు(terrorists) రెచ్చిపోయారు. తీగ లాగితే డొంక కదిలినట్టు దీని తరువాత చాలా మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో భారత బోర్డర్ ఎల్వోసీ చుట్టూ ఉగ్రవాదులు వేచి ఉన్నారని బీఎస్ఎఫ్ అధికారి చెబుతున్నారు.పాకిస్తాన్ ఎల్వోసీవెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు, 100 నుంచి 120 మంది దాకా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడడానికివేచి ఉన్నారని బీఎస్ఎఫ్ ఇనెస్పెక్టర్ జనరల్ యాదవ్ చెప్పారు. సరిహద్దు భద్రతా దళంలోని జి బ్రాంచ్ ఈ ఉగ్రవాద స్థావరాలపై నిఘా ఉంచిందని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రత పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. 2025 ఏడాది మొత్తంలో నాలుగు సార్లు ఎనిమిది మంది ఉగ్రవాదులు చొరబాటుకుప్రయత్నించారని..కానీ బీఎస్ఎఫ్ వారిని మట్టుబెట్టిందని ఇనెస్పెక్టర్ జనరల్ యాదవ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఇంకోవైపు పాక్ లోని ఉగ్రవాద సంస్థలు ఇండియాపై పెద్ద దాడికి కుట్ర పన్నారని తెలుస్తోంది. భద్రతా సంస్థలకు ఉగ్రవాద సంస్థల రహస్య సమావేశం గురించి సమాచారం అందడంతో తాజాగా హై అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించి టాప్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ కమాండర్లు సమావేశమయ్యారని చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి శనివారం పాకిస్థాన్‌లోని బహవల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. నిజానికి బహవల్పూర్ను జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ బలమైన స్థావరం. ఇక్కడకు కసూరి తరచుగా వచ్చి వెళుతుంటారని చెబుతారు. జైష్ చీఫ్ మసూద్ అజార్‌తో రహస్యంగా సమావేశమవుతాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
Follow Us