/rtv/media/media_files/2025/11/19/chhattisgarh-2025-11-19-11-02-18.jpg)
ఢిల్లీ బాంబు పేలుళ్ళు మొత్తం దేశాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేశాయి. దానికి తోడు పేలుళ్ళకు ఉగ్రవాద ముఠాలు చేసిన ప్రయత్నాలు, దాని వెనుక స్కెచ్ లు అందరినీ ఆశ్యర్యపోయేలా చేశారు. దీంతో భద్రతా బలగాలు ఫుల్ ప్రొటెక్షన్ లోకి వచ్చేశాయి. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను చేపట్టాయి. ఈ క్రమంలో నిన్న ముంబైలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఛత్తీస్ ఘడ్ లో ఇద్దరు మైనర్ బాలురను యాంటీ టర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరికీ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ బాలురు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐసిస్ హ్యాండ్లర్ ఆధ్వర్యంలో పని చేస్తున్నారని.. నకిలీ ఐడీల ద్వారా సోషల్ మీడియాలో ఉగ్రవాద, విద్వేష భావజాలం వ్యాప్తి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. అంతేకాదు ఈ ిద్దరు కుర్రాళ్ళు స్థానికంగా ఉన్న మరికొంత మంది బాలురను ఉగ్రవాదం వైపు ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
#Watch l ATS की कार्रवाई पर उपमुख्यमंत्री विजय शर्मा का बयान
— डीडी न्यूज़ (@DDNewsHindi) November 18, 2025
लंबी जाँच के बाद ATS को बड़ी सफलता मिली है.रायपुर के दो युवा ISIS से जुड़े हुए थे.इस ग्रुप के लिए काम करने वाले पाकिस्तान के मॉड्यूल सोशल मीडिया में एक्टिव थे. पूरा का पूरा सोशल मीडिया का उपयोग कर रहे थे.
UAPA की… pic.twitter.com/y0j2ihdNEi
మైనర్లను కూడా వదిలిపెట్టని ఉగ్రవాదులు..
ఉగ్రవాదులతో సంబధాలు కొనసాగిస్తున్న మైనర్లను గుర్తించడం ఇదే మొదటిసారని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చెబుతోంది. ఇలాంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో మరింత దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ముఖ్యంగా రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇతర ప్రధాన నగరాల్లో గాలింపు చేపడుతున్నామన్నారు అధికారులు. పాకిస్థాన్‌కు చెందిన ఐసిస్ మాడ్యూల్ భారత యువకులను లక్ష్యం చేసుకోవడానికి పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన మూలాలు వివిధ రాష్ట్రాల్లో కనిపించడంతో సోదాలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా, ఇతర డిటిజల్ మాధ్యమాల ద్వారా ఈ కేసుతో సంబంధం కలిగిన వ్యక్తులను కనిపెట్టడంపై కేంద్ర ఏజెన్సీలు దృష్టిసారించినట్టు ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. తాజాగా ముంబైలోని పలు ప్రాంతా్లో ముగ్గురు అనుమానితులను కేంద్ర ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురూ విద్యాధికులే కాకుండా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ముంబై పోలీసుల సాయం తీసుకుని దర్యాప్తు సంస్థలు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Also Read: Pakistan: పాక్ ప్రభుత్వమే ఉగ్రదాడులు చేయిస్తోంది..ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం ఆరోపణలు
Follow Us