/rtv/media/media_files/2025/11/12/fotojet-78-2025-11-12-19-44-36.jpg)
Sensational facts about the Delhi blast.. Role of female terrorists in the blasts
Delhi Blast: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు కారణం జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) అని దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. ఈ కేసులో లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్ ను అరెస్టు చేయడంతో ఈ విషయం మరింత నిర్ధారణ అయింది. అయితే ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా తమ ఉగ్రకుట్రలు అమలు చేయడానికి జైష్ మహిళా విభాగాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం.. ఈ ఉగ్రసంస్థకు భారతదేశంలో జమాత్-ఉన్-మోమినాత్ అని పిలిచే విభాగానికి డాక్టర్ షాహీన్ స్థానిక నాయకురాలుగా వ్యవహారిస్తోంది. ఈ విభాగం మహిళలను మోసగించడంతో పాటు, వారిని తీవ్రవాద మార్గాలను అనుసరించేలా బలవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం..ఢిల్లీ పేలుళ్లు జరగడానికి వారం ముందు ఈ మహిళా విభాగంలో కొత్త సభ్యురాలిని చేర్చారు. ఆమె పేరు అఫిరా బీబీ. ఈ మహిళ 2019లో జరిగిన పుల్వామా దాడిలో ఉగ్రవాద సూత్రధారులలో ఒకరి భార్య అని తెలుస్తోంది. ఆమెను బ్రిగేడ్ సలహా మండలిలో కూడా సభ్యురాలిగా చేర్చారు. ఇక్కడ ఆమె ఉగ్రవాది మసూద్ అజార్ చెల్లెలు అయిన సాదియా అజార్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు.
ఇంతకు అఫిరా బీబీ ఎవరంటే?
దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం.. అఫిరా బీబీ పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారులలో ఒకడైనజైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ కమాండర్ ఉమర్ ఫరూఖ్ భార్య. 2019లో డాచిగామ్ నేషనల్ పార్క్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఫరూక్ మరణించాడు. ఫిబ్రవరి 14, 2019న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కాన్వాయ్‌పైకి పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును పంపి 40 మంది సైనికులను చంపిన విషయం తెలిసిందే. వాస్తవానికి అక్టోబర్ 8న మసూద్ అజార్ మహిళా బ్రిగేడ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అక్టోబర్ 19న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని దుఖ్తరన్-ఎ-ఇస్లాంలో మహిళా సభ్యుల నియమకానికి సంబంధించి ఒక కార్యక్రమం జరిగింది. బ్రిగేడ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మసూద్ తన సోదరి సాదియాను నియమించాడు. ముస్లిం మహిళలలో తన భావజాలాన్ని వ్యాప్తి చేయాలనే అజార్ ప్రణాళికలో సాదియా, అఫిరా బీబీ నియామకం ప్రధానమైందిగా భావిస్తున్నారు.
ఢిల్లీ పేలుళ్లు మహిళా బ్రిగేడ్ పనేనా?
ఢిల్లీ బాంబు దాడుల తర్వాత ఈ కేసులో లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్ ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగానే ఈ బ్రిగేడ్ కార్యకలాపాలకు బలమైన ఆధారాలు బయటపడినట్లు సమాచారం. భారతదేశంలో జమాత్-ఉన్-ముమినాత్ సభ్యురాలైన షాహీన్ షాహిద్ కు దేశంలో సంస్థ స్థానిక శాఖను స్థాపించే పనిని అప్పగించినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారు పేలుడు జరిగి 12 మంది మృతి చెందగా, దాదాపు 24 మందికిపైగా గాయపడ్డారు. దీనికి కొన్ని గంటల ముందు ఆమె కారులో ఒక అస్సాల్ట్ రైఫిల్, మందుగుండు సామగ్రి లభించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ!
Follow Us