BREAKING: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానంతో సైన్యం అక్కడ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

New Update
jammu kashmir

jammu kashmir

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మచ్చిల్ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు ప్రయత్నించడంతో వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో అనుమానాస్పద కదలికను కూడా సైన్యం గుర్తించింది. వెంటనే ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ను ప్రారంభించింది. భారీ కాల్పుల మధ్య ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానంతో సైన్యం అక్కడ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. శీతాకాలం హిమపాతం ప్రారంభమయ్యే ముందు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం (BSF) ఈ సమయంలో నియంత్రణ రేఖ వెంబడి నిఘాను ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చూడండి: Crime News: కరీంనగర్‌లో దారుణం.. బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. ఆపై వీడియో తీసి..

ఇది కూడా చూడండి: Hyderabad Crime News: హైదరాబాద్‌లో ఘోరం. ఇద్దరు పిల్లలను చంపి మహిళ ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు