Australia: ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర..ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

బోండీ బీచ్ కాల్పులు ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర బయటపడింది. అక్కడి పోలీసులు చేపట్టిన భద్రతా ఆపరేషన్ లో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 

New Update
australia

ఆస్ట్రేలియా(australia) లోని సిడ్నీ(Sidney) లో బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతుండగా ఇద్దరు గన్‌మెన్లు బీచ్ లోకి దూసుకొచ్చి ఫైరింగ్ చేశారు. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులతో ఇద్దరు వ్యక్తులు పాదచారుల వంతెన పైకి వచ్చి కాల్పులు జరిపినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. కాల్పులు జరిపిన వారు తండ్రీ కొడుకులని గుర్తించారు. తండ్రి పేరు సాజిద్ అక్రమ్. ఆయనకు 50 ఏళ్లు. కొడుకు నవీద్ అక్రమ్‌కు 24 ఏళ్లని తెలిసింది. వీరిద్దరూ పాకిస్తాన్ ఉగ్రవాదులని కూడా గుర్తించారు. 

కారులో ఛేజ్ చేసి మరీ..

ఇప్పుడు తాజాగా మరో ఉగ్ర కుట్రను ఆస్ట్రేలియా పోలీసులు భగ్న చేశారు. నిర్దిష్ట సమాచారం అందుకున్న పోలీసులు భద్రతా ఆపరేషన్ ను చేపట్టారు. ఇందులో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. హింసాత్మక చర్యలు జరుగుతాయనే భయంతో రెండు వాహనాలను అడ్డగించి మరీ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముందే ఒక ప్రణాళిక వేసుకున్నారని..అటాక్ చేయడానికి సిద్ధమయ్యారని తెలిపారు. అయితే వీరికీ బోండీ బీచ్ ఉగ్రవాదులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. బోండీ బీచ్ ఘటన తర్వాత దేశంలో ఉద్రిక్తతలు ఎక్కువ అయ్యాయని పోలీసులు చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు