J&K: కాశ్మీర్ లో దాడులకు లష్కరే, జైషే ఉగ్రవాదులు సంయుక్తంగా ప్లాన్..

కాశ్మీర్ లో మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని నిఘా వర్గాలు హెచర్చించాయి. లష్కరే, జైషే మహమ్మద్‌లు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నాయని, చొరబాట్లు, గూఢచర్యం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

New Update
xx

ఈ ఏడాది ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అప్పటి నుంచి జమ్మూ-కాశ్మీర్ కాస్త ప్రశాంతంగా ఉన్నాయి. కానీ అక్కడ మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ మద్దతున్న లష్కరే, జైషే ఉగ్రవాదులు సమన్వయ దాడికి సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సెప్టెంబర్ నుంచి ఉగ్రవాద సంస్థలు చొరబాట్లు, గూఢచర్యం, సరిహద్దు లాజిస్టిక్స్ కార్యకలాపాలను గణనీయంగా పెంచాయి. లష్కరే, జైషే ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక యూనిట్లు ఐఎస్ఐ, పాకిస్థాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ సహకారంతో సరిహద్దుల్లో చొరబాటు మార్గాల ద్వారా జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించాయని నివేదికల్లో వెల్లడైంది.

కాశ్మీర్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు..

నిఘా వర్గాల నివేదిక ప్రకారం ఉగ్రవాది షంషేర్ నేతృత్వంలో లష్కరే యూనిట్ డ్రోన్ల సహాయంతో ఏరియల్ సర్వే నిర్వహించిందని...సరిహద్దుల్లో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించిందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆత్మాహుతి దాడులు లేదా పేలుళ్లు సంభవించవచ్చని భద్రతా వర్గదాలు అంచనా వేశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్వెంబడిఎస్ఎస్జీ మాజీ సైనికులతో ఏర్పాటైన పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌లు, ఉగ్రవాదులు మళ్లీ శిబిరాలను ఏర్పాటుచేసుకోవడం సరిహద్దుల్లో దాడులకు సంకేతాలని చెబుతున్నారు. నిఘా వర్గాల నివేదికల ప్రకారం.. అక్టోబరులో పీఓకేలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జమాతే ఇస్లామీ, హిజ్బుల్ముజాహిద్దీన్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనిలో ఆపరేషన్ సింధూర్ లో జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద ముఠాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో చెల్లాచెదురైన తమ నెట్‌వర్క్‌లను తిరిగి పునరుద్దరించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ లో భద్రతా బలగాలు, రాజకీయ నాయకులే టార్గెట్ గా దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఇప్పటికే కశ్మీర్ లోయలో తమకు సహకరించే వ్యక్తులు, వనరులను గుర్తించే పనిలో ఉన్నారని చెబుతున్నారు.

మరోవైపు జమ్మూ కాశ్మీర్లో(JammuKashmir) ప్రస్తుతం ఆపరేషన్ ఛత్రు నడుస్తోంది. కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో భారత సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య దురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్‌ను చేస్తున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

Also Read: Trump: కమ్యూనిజం vs కామన్ సెన్స్.. మామ్దానీ విజయంపై ట్రంప్ వ్యాఖ్య

Advertisment
తాజా కథనాలు