G7 Summit: జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జూన్ 16,17న కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు.
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జూన్ 16,17న కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు.
పచ్చి ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సల్ఫర్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి, రక్తపోటును స్థిరంగా ఉంచుతాయి. పచ్చి ఉల్లిపాయలో ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు.
కమెడియన్ రాహుల్ రామకృష్ణ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాహుల్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దర్శకుడిగా తన తొలి ప్రాజెక్ట్ మొదలు పెట్టానని.. ఆసక్తి గల నటీనటులు తమ షోరీల్స్, ఫొటోలను సంబంధింత మెయిల్ కి పంపించగలరని తెలిపాడు.
కాంతారా 2 చిత్రబృందంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ కలభవన్ నిజు గుండెపోటుతో మరణించారు. గురువారం ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం చోటు చేసుకుంది. సొంత తమ్ముణ్ణి వేట కొడవలితో గొంతు కోసి, నరికి హత్య చేశాడు అన్న. ఇల్లుని తనపేరుపై రిజిస్టర్ చేయించాలని గొడవ పడడంతో సొంత అన్న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం కొనసాగుతున్న క్రమంలో మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇరాన్ మరో ఇద్దరు కీలక అధికారులను కోల్పోయినట్లు తెలుస్తోంది.
ప్రతిరోజూ పసుపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ. పసుపు నీరు తాగితే గుండె ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును తగ్గించడానికి, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.