/rtv/media/media_files/2025/08/26/jammu-kashmir-rain-2025-08-26-18-20-48.jpg)
Jammu Kashmir Rain
జమ్మూ కాశ్మీర్‌లో వర్షాలు సాధారణంగా మంచు, వర్షం రెండింటి రూపంలో కురుస్తాయి. ఈ ప్రాంతంలో వర్షాలు ముఖ్యంగా నైరుతి రుతుపవనాల వల్ల, పశ్చిమ అవాంతరాల వల్ల సంభవిస్తాయి. హిమాలయ పర్వతాలు ఈ వర్షాలకు ప్రధాన కారణం. వర్షపాతం వల్ల జమ్మూ కాశ్మీర్‌లోని నదులు, వాగులు నిండుతాయి. పచ్చని లోయలు, దట్టమైన అడవులతో ఈ ప్రాంతం మరింత ఆహ్లాదకరంగా, సుందరంగా మారుతుంది. అయితే కొన్నిసార్లు అతివృష్టి వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతాయి. అయితే జమ్మూ కాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కుంభవృష్ఠి కారణంగా దోడా జిల్లాలో నలుగురు దుర్మరణం చెందగా.. పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి.
భారీ వర్షాలకు..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు తమ ఇళ్లు కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అసాధారణ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు నదీ తీరాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని పలు ముఖ్యమైన రహదారులు మూసుకుపోయాయి. దోడా, కిష్త్వార్‌లను కలిపే NH-244 మార్గంలో రహదారి తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి కూడా రాళ్లు దొర్లడంతో మూతపడింది. పర్యాటక ప్రాంతమైన వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడి యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: పెళ్లయినా మరోకరితో అక్రమ సంబంధం...కూతురును..లవర్‌ను కొట్టిచంపిన తండ్రి
ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. జోజిలా పాస్‌లో కురిసిన భారీ మంచు కారణంగా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారి కూడా మూసుకుపోయింది. తవి, రవి వంటి ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి మించి ఉప్పొంగుతున్నాయి. కథువాలో రవి నది పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అధికారులు సహాయం అందిస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి జమ్మూకు బయలుదేరి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసి.. ప్రజలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇది కూడా చదవండి: కొండల్లో చిక్కుకున్న వందలాది టూరిస్టులు.. విరిగిపడ్డ కొండచరియలు