Rahul Gandhi: ఎన్నికల తేదీని బీజేపీ నిర్ణయిస్తోంది.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓట్లను దొంగిలించే ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అంతేకాదు ఎన్నికలు తేదీలను కూడా ఎన్నికల కమిషన్‌కు బదులు బీజేపీనే నిర్ణయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
BJP, and not EC, decides dates of elections, alleges Rahul Gandhi at rally in Bihar’s Madhubani

BJP, and not EC, decides dates of elections, alleges Rahul Gandhi at rally in Bihar’s Madhubani

కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఓటు చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓట్లను అపహరించాయని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం ఆయన బిహార్‌లో ఓటరు అధికార యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మధుబానిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓట్లను దొంగిలించే ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అంతేకాదు ఎన్నికలు తేదీలను కూడా ఎన్నికల కమిషన్‌కు బదులు బీజేపీనే నిర్ణయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: శ్రీదేవి ఆస్తి కోసం కోర్టుకెక్కిన బోనీ కపూర్.. అసలు వివాదం ఏంటి?

ఈసీని అడ్డం పెట్టుకుని ఓట్ల చోరీ జరిగుతున్న అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. '' NDA ప్రభుత్వం మరో 40 అధికారంలో ఉంటుందని అమిత్‌ షా ఉన్నారు. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసు ?. ఇలాంటి ఓట్ల చోరీకి పాల్పడితే ఎన్నేళ్లపాటైనా అధికారంలో ఉండొచ్చు. కొన్నేళ్ల క్రితం గుజరాత్‌లో ఓట్ల చోరీ మొదలైంది. ఇప్పుడు కేంద్రం వరకు వచ్చింది. ప్రతీ రాష్ట్రంలో కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తేదీని మారుస్తున్నారు. ఇలాంటి వాటిపై ఎవరూ కూడా ప్రశ్నించకుండా, అక్రమాలు జరిగినప్పటికీ కూడా ఈసీపై కేసు నమోదు చేయకుండా చట్టం తీసుకొచ్చారు. మణిపూర్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు వచ్చారు. అక్కడ బీజేపీ గెలిచింది.  

Also Read: సెల్ఫీ మరణాల్లో ఇండియానే టాప్‌.. రిపోర్టులో సంచలన నిజాలు

ఎన్నికల సంఘం అధికారులు దీనిపై ఆలోచన చేయాలి. ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డ వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. బిహార్‌ ప్రజల ఓటు హక్కును రక్షించేందుకు ఇండియా కూటమి ఎంతదూరమైన వెళ్తుంది. RSS ఎప్పుడూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించలేదు. ఆ సంస్థ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. ఇప్పడు మనం ఓటు హక్కును కోల్పోతే రాజ్యాంగాన్ని ఎప్పటికీ కూడా రక్షించుకోలేమని'' రాహుల్ గాంధీ అన్నారు. 

Advertisment
తాజా కథనాలు