Floods: భయంకరమైన వరదలు.. నలుగురు మృతి

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. కఠువా, కిశ్త్‌వాడ్‌లో కూడా వరదలు సంభవించాయి.

New Update
4 dead in Jammu and kashmir's Doda after cloudburst triggers flash floods, damages houses

4 dead in Jammu and kashmir's Doda after cloudburst triggers flash floods, damages houses

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. కఠువా, కిశ్త్‌వాడ్‌లో కూడా వరదలు సంభవించాయి. మరోవైపు జమ్మూ ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాంబా, జమ్మూ, రాంబన్, కిశ్త్‌వాడ్, కఠువా జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. వాతావరణ అనుకూలంగా లేని కారణంగా విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు.  

Also Read: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?

రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్, కేలామోర్, బ్యాటరీ చెష్మా వద్ద భారీ వర్షాలతో పాటు కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా జమ్మూశ్రీనగర్‌ నేషనల్ హైవేపై ట్రాఫిక్‌ను ఆపేశారు. వరదల బీభత్సవానికి కిశ్త్‌వాడ్, రాజౌరీ, డొడా జిల్లాల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం తావి, రావి, చీనాబ్ నదురు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆగస్టు 27 వరకు జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌లు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్‌లను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు.    

Also Read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో కూడా వరదలు పోటెత్తాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఓ వ్యక్తితో పాటు ముగ్గురు చిన్నారులు ఉండటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని 40 మందితో కూడిన కుటుంబ సభ్యులు, బంధువులు స్థానికంగా ఓ ఆలయానికి వచ్చారు. తిరుగుప్రయాణంలో వాళ్లు నడుచుకుంటూ వాగు దాటుతున్నారు. ఆ సమయంలోనే భారీ వర్షం కురిసింది. వాగులోకి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో నలుగురు నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. వరదలో గల్లంతైన వారి కోసం గాలించిన రెస్క్యూ సిబ్బంది ఆ నలుగురి మృతదేహాలను బయటకి తీశారు.   

Also Read: కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Advertisment
తాజా కథనాలు