/rtv/media/media_files/2025/08/26/selfie-death-2025-08-26-20-16-49.jpg)
India Ranks 1st In World’s Deadliest Countries For Selfies
ఒకప్పుడు ఫొటోలు తీసుకోవాలంటే కెమెరానే వాడేవారు. ప్రస్తుతం అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు రావడంతో మనకిష్టం వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే సౌకర్యం వచ్చేసింది. ఈమధ్య కాలంలో సెల్ఫీలు తీసుకోవడం విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా దీనికి సంబంధించి ఓ సంచలన రిపోర్టు వచ్చింది. రూఫ్‌టాప్‌లు, కొండలు, ఇతర ఎత్తైన నిర్మాణాల పైనుంచి పడిపోయి మృతి చెందిన వారిలో 46 శాతం మంది సెల్ఫీ తీసుకున్నవారేనని తేలింది. 'ది బార్బర్ లా ఫిర్మ్' అనే సంస్థ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయిన వారిలో మొదటి స్థానంలో ఇండియానే నిలవడం గమనార్హం.
Also Read: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?
ఈ నివేదిక ప్రకారం సెల్ఫీలు తీసుకొంటూ మరణించిన వారిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం 271 ప్రమాదాలు సంభవించగా అందులో 214 మంది చనిపోయారు. మరో 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలు, ఎత్తైన కొండలు, రైల్వే ట్రాక్‌లపైన ఈ ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్లు బయటపడింది. ఇక రెండో స్థానంలో అమెరికా నిలిచింది. ఈ దేశంలో సెల్ఫీ తీసుకుంటుండగా 45 ప్రమాదాలు జరిగాయి. అందులో 37 మంది మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. ఇక్కడ వాటర్‌ఫాల్స్, రూఫ్‌టాప్స్, రహదారుల్లో ఎక్కువగా ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
Also Read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్
మూడో స్థానంలో రష్యా ఉంది. ఇక్కడ 19 మరణాలు సంభవించగా ఒకరు గాయపడ్డారు. ఈ దేశంలో ఎక్కువగా మంచుతో నిండిన ప్రకృతి ప్రదేశాలు, వంతెనలు, ఆకాశహర్మ్యాల వద్ద చేసిన సెల్ఫీ స్టంట్లు ప్రమాదాలకు దారి తీశాయి. నాలుగో స్థానంలో పాకిస్థాన్ నిలిచింది. ఇక్కడ 16 మంది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. ఇక 15 సెల్ఫీ మరణాలతో ఆస్ట్రేలియా ఆరోస్థానంలో ఉంది. ఇండోనేషియా 14 సెల్ఫీ మరణాలతో 6వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కెన్యా, యూకే, స్పెయిన్, బ్రెజిల్‌లోని ఒక్కో దేశంలో 13 మంది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read: కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?