OG: ఓజీతో ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ?..

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్, దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో వస్తున్న కొత్త మూవీ OG. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. పవన్‌ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్‌ ఓజీలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

New Update
Pawan kalyan's Son Akira Nandan likely to Grand Debut in OG

Pawan kalyan's Son Akira Nandan likely to Grand Debut in OG

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్, దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో వస్తున్న కొత్త మూవీ OG. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. పవన్‌ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్‌ ఓజీలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ చిత్రంలో అకీరా నందన్  ఉంటాడని, ఓ స్పెషల్ రోల్‌ కోసం అకీరానే ఫైనల్ చేశారనే వార్తలు వస్తున్నాయి. 

Also Read: అందాల నిధి.. హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న పవన్ హీరోయిన్!

అయితే ఓజీలో పవన్‌ 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందులో యంగ్ ఏజ్‌ పాత్ర కూడా ఉంది. దీనికోసమే ఆయన కొడుకు అకీరా నటించినట్లు సమాచారం. అయితే సినిమా విడుదలయ్యే వరకు దీన్ని సీక్రెట్‌గా ఉంచాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరికొందరు మాత్రం అందులో వాస్తవం లేదని, అదంతా ఫేక్ అని చెబుతున్నారు.

ఒకవేళ అకీరా నందన్ ఓజీతో ఎంట్రీ ఇస్తే ఆయనకు ఇదే గ్రాండ్‌ సిల్వర్‌ స్క్రీన్ డెబ్యూ అవుతుంది. ఇప్పటివరకు చాలా సినిమాలకు పవన్‌ రీమేక్‌లే చేశారు. ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు ఒరిజనల్ అయినప్పటికీ ఈ చిత్రానికి యావరేజ్‌ టాక్ వచ్చింది. గ్రాఫిక్స్‌పై కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. 

Also Read:  బిగ్ బాస్ లోకి మహా కుంభ్‌మేళా బ్యూటీ..హౌస్ ను అల్లాడిస్తుందా?

దీంతో పవన్ ఫ్యాన్స్‌ ఓజీ పైనే ఆశలు పెట్టుకున్నారు. సాహో సినిమా తీసిన సుజీత్‌ డైరెక్షన్‌పై అందరికీ మంచి అభిప్రాయమే ఉంది. అప్పట్లో సాహో అంతగా ఆడకపోయిన స్క్రీన్‌ప్లేకు మాత్రం సుజిత్‌కు ప్రశంసలు వచ్చాయి. అందుకే ఓజీ సినిమా అంచనాలు పెంచుతోంది. ఏడాది క్రితమే ఓజీ గ్లింప్స్‌కు విడుదల చేయగా.. దానికి మంచి గుర్తింపు వచ్చింది. యూట్యూబ్‌లో దానికి 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా ఓ పాటను కూడా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2న పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించి మరో కీలక అప్‌డేట్ రానుంది. 

Also Read: పోర్ట్ ఏరియా డాన్ గా విశాల్.. 'మకుటం' టైటిల్ టీజర్ అదిరింది భయ్యా !

వాస్తవానికి ఈ సినిమాను గతేడాది సెప్టెంబర్ 27నే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటం, డేట్స్ కుదరకపోవడం వంటి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లలో సందడి చేయనుంది. 

Also Read: ఏఆర్ మురుగదాస్ మరో యాక్షన్ థ్రిల్లర్.. 'మదరాశి' ట్రైలర్ అదిరింది!

Advertisment
తాజా కథనాలు