Crime: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య
కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు.
కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు.
కాల్చిన మఖానాలో అధిక పొటాషియం, తక్కువ సోడియం ఉంటాయి. ఇది రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్చిన మఖానా జీర్ణక్రియకు ఒక అద్భుతమైన ఎంపిక. బరువు తగ్గాలంటే కాల్చిన మఖానా తినవచ్చు.
ఖమ్మం జిల్లా మర్రిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుండి ఇల్లందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్‌తో కూడిన యాష్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆర్టీసీ కండక్టర్ సహా కనీసం పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
పెళ్లి మండపంలో అతిథులు నిల్చున్న పై కప్పు కూలిపడడం నెట్టింట వైరల్ అవుతోంది. మరి కాసేపట్లో మూహూర్తం అనగా.. మండపం పక్క భాగంలోని పై కప్పు కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అంజీర్ పాలలో ఫైబర్ మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఈ పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ శనివారం ఉదయం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అణుస్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడి చేసింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి చేసినట్లు ఇరాన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఎయిరిండియా విమానంలో తానూ ప్రయాణించానని మంచు లక్ష్మి తాజాగా పోస్టు చేసింది. అయితే అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్‌కు వెళ్లానని తెలిపింది. ఈ విషాదకరమైన విమాన ప్రమాదంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కి చేరింది. మొదట 265 మంది చనిపోయినట్లు నిర్ధారించగా తాజాగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. బీజే మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది చనిపోయారు. ప్రమాదం జరగగానే 24మంది.. చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు.