/rtv/media/media_files/2025/08/26/telangana-local-body-elections-2025-08-26-19-15-14.jpg)
Telangana Local body elections
తెలంగాణలో పంచాయతి ఎన్నికలకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఆగస్టు 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు లిస్టును విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 29న జిల్లాస్థాయి, అలాగే 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని.. సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాను రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.
Also Read: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?
ఇదిలాఉండగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జూన్ 25న హైకోర్టు కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలాఖరులోపు ఈ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లోనే వార్డుల విభజన పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సూచనలు చేసింది. 2024 జనవరి 31 నాటికే సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికలపై ఆలస్యం కావడంతో కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌ల పాలన లేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, అభివృద్ధి వెనకబడుతోందని బీఆర్‌స్, బీజేపీ విమర్శలు చేస్తోంది.
Also Read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్
మరోవైపు ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కూడా వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు దీనిపై ధర్నా కూడా చేశారు. ఒకవేళ కేంద్రం ఈ రిజర్వేషన్లకు ఆమోదం తెలపకపోతే తామే పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రిజర్వేషన్ల అంశం తేలాకే రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనుందని తెలుస్తోంది.
Also Read: కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?