/rtv/media/media_files/2025/08/23/vinayaka-chavithi-2025-2025-08-23-19-42-11.jpg)
Vinayaka Chavithi 2025
హిందువుల పండుగల్లో వినాయక చవితి(vinayaka chavithi 2025) కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిజానికి పండుగలన్నింటిలో మొదటిగా జరుపుకునే పండుగ ఇదే. ఈ పండుగ తర్వాతే మిగతా పండుగలు వరుసగా వస్తాయి. వినాయకుడి పుట్టిన రోజుగా ఈ వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే వినాయకుడిని విఘ్నాలకు అధిపతిగా, శుభకార్యాలకు మూలకర్తగా భావిస్తారు. అందుకే ఏ కార్యం మొదలుపెట్టాలన్నా ముందుగా గణపతిని పూజిస్తారు. అయితే ప్రతీ ఏడాది భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన వినాయక చవితిని నిర్వహిస్తారు. అయితే మిగతా వినాయక చవితి కంటే ఇప్పుడు వచ్చే వినాయక చవితి చాలా స్పెషల్. ఎందుకంటే ఇది 500 ఏళ్ల తర్వాత వస్తోంది. ఈ వినాయక చవితి నాడు సర్వర్థ్ సిద్ధి యోగ, రవి యోగ, ప్రీతి యోగ, ఇంద్ర యోగ, బ్రహ్మయోగాలు ఏర్పడనున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం పట్టనుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Ganesh Chaturthi 2025: ఈ సమయంలో గణపతి పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే.. శుభ ముహూర్తం, పూజా విధానం
కుంభరాశి
500 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి వినాయక చవితి(Ganesh Chathurthi 2025) వస్తోంది. దీనివల్ల కుంభరాశి వారికి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు అంటున్నారు. అలాగే ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయని చెబుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. ఈ వినాయక చవితి నుంచి డబ్బు సంపాదించడానికి ఎన్నో అవకాశాలు కూడా వస్తాయి. అలాగే వ్యాపారాలకు కూడా బాగా కలసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే భవిష్యత్తు గురించి పొదుపు చేస్తారని పండితులు అంటున్నారు.
తులా రాశి
ఈ వినాయక చవితి నుంచి తులా రాశి వారికి బాగా కలసి వస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. అలాగే ఏ వ్యాపారం చేపట్టినా కూడా లాభాలు వస్తాయి. అందరితో కలిసి హ్యాపీగా ఉంటారు. ఇకపై ఎలాంటి సమస్యలు కూడా రావు. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుందని పండితులు అంటున్నారు. గతంలో ఎక్కువగా ఏ పని చేపట్టినా నష్టాలు ఉండేవి. కానీ ఇకపై అలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు.
మకర రాశి
ఈ రాశి వారికి వినాయక చవితి నుంచి బాగా కలసి వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి వీరు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా ఈ వినాయక చవితితో తీరిపోతాయి. అలాగే ఆగిపోయిన పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి. ఏ పని ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రారంభించినా కూడా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు. నష్టాల కంటే లాభాలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. అలాగే ఇన్ని రోజుల నుంచి లేని గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఇకపై వస్తాయని పండితులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Ganesh Chaturthi 2025: గణపతిని ప్రతిష్టించేటప్పుడు ఈ వాస్తు తప్పులు చేస్తే దరిద్రం !