Kidney Failure: ఈ 7 లక్షణాలు కనిపిస్తే మీకు మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లే.. తప్పక తెలుసుకోండి!

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు కిడ్నీ వైఫల్యం ఏర్పడుతుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం మూత్రంలో వచ్చే మార్పులు. అకస్మాత్తుగా మూత్రం పరిమాణం తగ్గడం, నురుగుతో కూడిన మూత్రం రావడం కిడ్నీల నుంచి ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Kidney Failure

Kidney Failure

మూత్రపిండాలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి, వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి, శరీరం యొక్క ద్రవ సమతుల్యతను నిర్వహిస్తాయి. మూత్రపిండాల వ్యాధి (Kidney Disease) అంటే ఈ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం. దీనికి అధిక రక్తపోటు (High Blood Pressure), మధుమేహం (Diabetes) వంటివి ప్రధాన కారణాలు. ఈ వ్యాధి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు చూపించకపోవచ్చు. అందువల్ల చాలా మందికి తమకు ఈ సమస్య ఉందని తెలియదు. వ్యాధి ముదిరిన తర్వాత.. కాళ్ల వాపులు, అలసట, మూత్రవిసర్జనలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధిని గుర్తించడంలో జాప్యం జరిగితే అది కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీయవచ్చు. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే మూత్రపిండాల వైఫల్యం గురించి 7 లక్షణాలతో ముందుగానే తెలుసుకోవచ్చు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల..

ఆధునిక జీవనశైలిలో అనేక వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో మూత్రపిండాల (కిడ్నీల) ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం మానేసినప్పుడు కిడ్నీ వైఫల్యం అనే తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రారంభ దశలో లక్షణాలు అంతగా కనిపించకపోయినా.. కొన్ని సంకేతాలను ముందుగా గుర్తించడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. ఈ సమస్యకు ప్రధాన లక్షణాల్లో ఒకటి మూత్రంలో వచ్చే మార్పులు. అకస్మాత్తుగా మూత్రం పరిమాణం తగ్గడం లేదా నురుగుతో కూడిన మూత్రం రావడం కిడ్నీల నుంచి ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు సూచిస్తుంది. అలాగే కాళ్లు, చీలమండలు, ముఖం వాపు వస్తే అది శరీరంలో అదనపు నీరు పేరుకుపోతున్నదానికి సంకేతం కావచ్చు. నిరంతర అలసట, బలహీనత కూడా కిడ్నీ వైఫల్యానికి మరో ముఖ్య లక్షణం. కిడ్నీలు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

ఇది కూడా చదవండి: ఫ్లైవనాయిడ్ల వినియోగంతో ఆరోగ్యం మెరుగు.. పరిశోధనలు ఏం చెపుతున్నాయో మీరూ తెలుసుకోండి!

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, నోటిలో లోహ రుచి కూడా ఈ వ్యాధి లక్షణాలు. చర్మం దురద, పొడిబారడం కూడా కిడ్నీ సమస్యలకు ఒక కారణం. తీవ్రమైన సందర్భాల్లో ఈ సమస్య మెదడును కూడా ప్రభావితం చేసి గందరగోళం, ఏకాగ్రత లోపం వంటి వాటికి దారితీస్తుంది. ఈ లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవడం ద్వారా కిడ్నీ వైఫల్యాన్ని అదుపులోకి తెచ్చి తీవ్రమైన పరిణామాలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నీరు తాగడం ద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వెండి గొలుసు మెడలో వేసుకుంటే 7 అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!

Advertisment
తాజా కథనాలు