Crime: విషాదం.. భవనంపై నుంచి దూకిన మహిళ మృతి
హైదరాబాద్లో సనత్నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్మెట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది.
Geyser water: గీజర్ నీటితో స్నానం చేయడం వల్ల కలిగే చెడు ఇదే
గీజర్ నీరు ఎక్కువగా వాడితే దాని దుష్ప్రభావాలు ఉన్నాయి. వేడి గీజర్ నీటిలో స్నానం చేయడం వల్ల చర్మంలోని తేమ తగ్గుతుంది. వేడి నీరు చర్మంలోని సహజ తేమను తొలగిస్తుంది. ఇది దురద లేదా మంటగా, చర్మాన్ని పొడిగా, గరుకుగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
DSC Exams: బిగ్ అలర్ట్.. డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు
ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.
South Africa: WTC ఛాంపియన్గా సౌతాఫ్రికా.. 27 ఏళ్ల తర్వాత ట్రోఫీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దక్షిణఫ్రికా సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బంపర్ విక్టరీ సాధించింది. ఐదెన్ మార్క్రమ్ (136) సెంచరీతో చెలరేగిపోయాడు. 27 ఏళ్ల తర్వాత మరోసారి టైటిల్ను సఫారీ జట్టు సొంతం చేసుకుంది.
Mint Water: పుదీనా నీళ్లు తాగడం వల్ల ఏ వ్యాధులు నయమవుతాయో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో లేదా రోజుకు ఒకసారి పుదీనా నీరు తాగితే... అది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుదీనా నీరు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, అజీర్తి, తలనొప్పి, మైగ్రేన్, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Raw Garlic: ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఏమవుతుంది..?
పచ్చి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని, ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
Digital Arrest: మరో డిజిటల్ అరెస్ట్.. రూ.13.50లక్షలు దోపిడీ
సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సైబర్ కేటుగాళ్లకు బలై ఓ లేడి డాక్టర్ రూ.13.50 లక్షలు పోగొట్టుకుంది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.