AP Crime: ఏపీలో పండగ పూట పెను విషాదం.. ఆరుగురికి కరెంట్ షాక్..!

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో వాలీబాల్ ఆడుకునేందుకు పోల్‌లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఏడిద చరణ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

New Update
_Kakinada Crime News

Kakinada Crime News

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  గురువారం ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్‌లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈరోజు ఉదయం మూలపేట గ్రామంలోని కొంతమంది యువకులు వాలీబాల్ ఆడుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోల్‌లు నిలబెడుతుండగా అవి పక్కనే ఉన్న విద్యుత్ లైన్‌కు తగిలాయి. ఈ ఘటనలో ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఏడిద చరణ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

వాలీబాల్ ఆడుతూ విద్యుత్ షాక్‌..

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వల్లూరి నగేష్ (27), మడికి నిఖిల్ (18) లను పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడిన విష్ణు, రాజు, తేజ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో మూలపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

ఇది కూడా చదవండి: నర్సాపూర్ ట్రైన్‌లో భారీ దొంగతనం.. 68 గ్రాముల బంగారం చోరీ చేసిన దుండగులు!

Advertisment
తాజా కథనాలు