/rtv/media/media_files/2025/08/27/rahul-gandhi-and-priyanka-gandhi-2025-08-27-15-27-38.jpg)
Rahul Gandhi and Priyanka Gandhi
ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. ఇక విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ ఓటర్ అధికార్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం ముజఫర్‌పుర్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్పొన్నారు. రాహుల్ స్వయంగా తన సోదరిని బైక్ ఎక్కించుకుని బైక్ రైడ్ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
— Congress (@INCIndia) August 27, 2025
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఇతర ఇండియా కూటమి నేతలు సైతం ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆగస్టు 17న బిహార్‌లోని ససారామ్‌లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 1300 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. సెప్టెంబర్ 1న ఈ ర్యాలీ ముగియనుంది. బుధవారం జరగనున్న ఈ ఓటర్ యాత్రలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా పాల్గొన్నారు. మరోవైపు మంగళవారం దర్భంగాలో జరిగిన ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.
Also Read: అలాంటి దేశాలే శక్తిమంతంగా మారుతాయి.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఓటుహక్కును ప్రజలు రక్షించుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణకు ఇది ఎంతో అవసరమని తెలిపారు. బీజేపీ, ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గుజరాత్ మోడల్ అభివృద్ధి మోడల్ కాదని.. ఓటు దొంగతనం మోడల్ అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఇటీవల బెంగళురులోని మహేదేవ్‌పుర నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా చోరీ అయ్యాయని రాహుల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫేక్ ఐడీలు, ఫేక్ అడ్రెస్‌లతో ఓటరు కార్డులు సృష్టించారని విమర్శలు చేశారు. ఈసీ, బీజేపీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయంటూ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఈసీ కూడా దీనిపై స్పందించింది. ఓటు చోరీ అనేది ఏం జరగలేదని స్పష్టం చేసింది. ఈసీని విమర్శించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనన్న వ్యాఖ్యలు కూడా చేసింది.
BJP का गुजरात मॉडल कोई विकास का नहीं, वोट चोरी का मॉडल है। https://t.co/IM4yFRHxgzpic.twitter.com/IrBHB5dJUA
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2025
ఇదిలాఉండగా బిహార్‌లో మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్రం ఎన్నికల సంఘం బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఓటరు లిస్టులో నుంచి ఈసీ 65 లక్షల ఓటర్లను తొలగించడంపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్‌లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!