/rtv/media/media_files/2025/08/21/lord-ganesh-2025-08-21-17-41-05.jpg)
ఆగస్టు 27వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో వినాయక చవితి వేడుకల కోసం పోలీసులు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిబంధనలను పోలీసులు రూపొందించారు. బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు పోలీసులు వెబ్‌సైట్ లింక్ (https://policeportal.tspolice.gov.in/index.htm) కూడా అందుబాటులో ఉంచారు.
Also Read : AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..మావోయిస్టుల కోసం ప్రత్యేక కోర్టు
మండపాల కోసం రోడ్లను క్లోజ్ చేయకూడదు. కనీసం బైక్ వెళ్లేందుకు దారి ఇవ్వాలి. ప్రజల రాకపోకలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదు. అలాగే, డీజేలకు అనుమతి లేదు. మండపాల వద్ద కేవలం రెండు బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలి. అంతేకాకుండా మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించడానికి నిర్వాహకులు కనీసం ముగ్గురు వాలంటీర్లను నియమించాలి.
వీరు విగ్రహం, దాని పరిసరాలను పర్యవేక్షిస్తుండాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే భక్తుల రద్దీ అధికంగా ఉన్న మండపాల వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకొవాలని, ఎవరైనా మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ శాఖ.. వినాయక మండపాల నిర్వహకులను ఆదేశాలు జారీ చేసింది.
Also Read : Crime : ఎంతకు తెగించావ్ రా... అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని చంపేశాడు!
విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ
మరోవైపు ఏపీలో మండపం ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితంగానే ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్ అధికారి స్థలాన్ని పరిశీలించి, నిబంధనలు పాటిస్తే క్యూఆర్ కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారు. విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, సమయం, ఊరేగింపు మార్గం వంటి వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలి. ఈ వివరాలను దరఖాస్తులోనే కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రజల రాకపోకలకు, వాహనాలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లు, ఫుట్‌పాత్‌లు లేదా రహదారుల పైన మండపాలు ఏర్పాటు చేయకూడదు. మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం లేదా మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే ప్రసంగాలు, పాటలు ప్రసారం చేయడం వంటివి పూర్తిగా నిషేధించబడ్డాయి.
Also Read : Pakistan : దెబ్బ మీద దెబ్బ .. దారుణంగా మారిన పాకిస్తాన్ పరిస్థితి.. అయ్యో దేవుడా!