/rtv/media/media_files/2025/08/27/cm-revanth-2025-08-27-14-53-37.jpg)
దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇంట్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి సీఎం రేవంత్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం సీఎం రేవంత్ తో పాటు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా అంతకుముందు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గణేష్ మండపాలు, ఊరేగింపుల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
గణేష్ చతుర్థి సందర్భంగా…
— Revanth Reddy (@revanth_anumula) August 27, 2025
నా స్వగృహంలో గణనాథుడికి…
కుటుంబ సమేతంగా…
ప్రత్యేక పూజలు నిర్వహించాను.#GaneshChaturthi2025#Ganesha#VinayakaChaturthi#Ganeshotsavpic.twitter.com/i3XVkT6axu
69 అడుగుల ఎత్తుతో
మరోవైపు హైదరాబాద్ లో వినాయకచవితి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. వర్షం పడుతున్నప్పటికీ భక్తులు గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం (71వ ఏట) ఖైరతాబాద్ గణేష్ విగ్రహం 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తోంది. విగ్రహం మూడు తలలతో నిల్చున్న భంగిమలో ఉంది.
విగ్రహం దిగువన కుడివైపు పూరీ జగన్నాథ స్వామి, ఎడమవైపు శ్రీ లలితా త్రిపురసుందరి విగ్రహాలు ఉంటాయి. అలాగే, ప్రధాన మండపానికి కుడివైపు శ్రీలక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు శ్రీ గజ్జలమ్మ కొలువుదీరనున్నారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టి (క్లే)తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) లేకుండా, నీటిలో కరిగే రంగులతో తయారు చేస్తున్నారు. దీనివల్ల నిమజ్జనం ప్రక్రియ పర్యావరణానికి హాని కలిగించకుండా ఉంటుంది. దాదాపు 125 మంది కళాకారులు విగ్రహం తయారీలో పాల్గొన్నారు.