BIG BREAKING: వైసీపీకి బిగ్ షాక్.. ఏ క్షణమైనా పేర్ని నాని అరెస్ట్?

వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పేర్నినానిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

New Update
Perni Nani YCP Ex Minister May Arrest

వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పేర్నినానిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పేర్నినాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పోలీసులకు రవి అనే వ్యక్తి ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి:AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీలో ఘరానా మోసం .. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిపోయారు!

దీంతో నానిపై BNS యాక్ట్ 353(2), 351(3) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. గత కొద్దిరోజులుగా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు చేయడంతో దెందులూరు పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. కేసు నేపథ్యంలో నానిని పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేక మరేలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 
ఇది కూడా చదవండి: Smart Ration Cards : మీకు స్మార్డ్ రేషన్ కార్డు రాలేదా.. ఇలా చిటికెలో దరఖాస్తు చేసుకోండి!

అసలేమైందంటే..

ఇటీవల దెందులూరులో టీడీపీ శ్రేణులు వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన వ్యవసాయ క్షేత్రంపై దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని, శైలజానాథ్, పలువురు ముఖ్య నేతలతో కూడిన వైసీపీ బృందం దెందులూరు వెళ్లి అబ్బయ్య చౌదరిని పరామర్శించింది. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన నేతలు ఎమ్మెల్యే చింతమనేనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. చింతమనేని బెదిరింపులకు భయపడేదే లేదన్నారు. అబ్బయ్య చౌదరిని చంపేయాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆస్తులను నాశనం చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. అబ్బయ్య చౌదరికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ గుండాల ఆగడాలు తారా స్థాయికి చేరాయన్నారు.

ఇదిలా ఉంటే.. దెందులూరు నియోజకవర్గం 2009, 14 ఎన్నికల్లో టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. 2019 ఎన్నికల్లో చింతమనేనిని ఓడించడమే లక్ష్యంగా అబ్బయ్య చౌదరిని బరిలోకి దించింది వైసీపీ. ఆ ఎన్నికల్లో చింతమనేని ఓటమి పాలయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పలు కేసుల్లో చింతమనేనిని జైలుకు కూడా పంపించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీ Vs టీడీపీ గా రాజకీయం సాగుతోంది. అనేక సార్లు ఈ ఇద్దరు నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయం అట్టుడుకుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అందోళన నేతల్లో వ్యక్తం అవుతోంది.

Advertisment
తాజా కథనాలు