Rajnath Singh: అలాంటి దేశాలే శక్తిమంతంగా మారుతాయి.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, టెక్నికల్, మానవరహిత వైమానిక వాహనాలు, శాటిలైట్ ఆధారిత నిఘా లాంటి వాటని యుద్ధ ఆయుధాలుగా వినియోగిస్తారన్నారు.

New Update
Defence Minister Rajnath Singh

Defence Minister Rajnath Singh

Rajnath Singh:

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో జరిగే యుద్ధ విధానాలు పూర్తిగా మారుతాయన్నారు. రాబోయే రోజుల్లో ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, టెక్నికల్, మానవరహిత వైమానిక వాహనాలు, శాటిలైట్ ఆధారిత నిఘా, దౌత్యం, ఆర్థిక వ్యవస్థ లాంటి వాటని యుద్ధ ఆయుధాలుగా వినియోగిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో ముందడుగు వేసిన దేశాలే నిజమైన ప్రపంచశక్తిగా ఉద్భవిస్తాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన రణ్-సంవాద్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also Read: హిందూమహాసముద్రంలో కూలిపోయిన స్పేస్ X రాకెట్.. ఇండియాకి ప్రమాదమా?

భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లు మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.అందుకే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు రెడీగా ఉండాలని పేర్కొన్నారు.'' యుద్ధం, సంభాషణలు పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. కానీ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ద్వైపాక్షిక చర్చలే యుద్ధాలను ఆపుతాయి. భారత్‌ ఎప్పటికీ కూడా యుద్ధాన్ని కోరుకునే దేశం కాదు. ఎవరిపైకూడా దురాక్రమణకు పాల్పడదు. మనల్ని సవాలు చేసినవాళ్లకి మాత్రం గుణపాఠం చెప్తాం. ఆపరేషన్ సిందూర్‌ సమయంలోనే భారత్ తన శక్తిని ప్రపంచ దేశాలకు చూపించింది.

Also Read: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్‌లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!

ఉగ్రవాదులు మనం చేసే దాడులు పసిగట్టే అవకాశం లేకుండానే వాళ్లపై దాడి చేసి దెబ్బకొట్టాం. ఈ ఆపరేషనే సాంకేతిక ఆధారిత యుద్ధానికి చక్కటి ఉదాహరణ. రోజురోజుకు ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. వాటికి తగ్గట్లుగా మనం బలగాలను రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం శక్తిబాన్ రెజిమెంట్, దివ్యాస్త్ర బ్యాటరీ, రుద్ర, డ్రోన్ ప్లాటూన్‌ లాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు మన ఆర్మీ చొరవ తీసుకుంటోంది.  

ఇండియన్ నావీని మరింత బలోపేతం చేయడం కోసం కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా విశాఖపట్నం నౌకాదళ డాక్‌యార్డ్‌లోకి INS ఉదయగిరి, INS హిమగిరి చేరుకున్నాయి. వీటిని ప్రారంభించడం నావికాదళాన్ని బలోపేతం చేయడంలో భాగమే. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత సర్కార్‌ ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాంగానే స్వదేశీ ఆయుధాలు, మిసైల్స్‌ను తయారుచేసేందుకు ప్రోత్సహిస్తోందని'' రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  

Also Read: 50 పైసల హోమ్ ఇన్సూరెన్స్‌తో కోట్లకు పైగా కవరేజ్.. పొందడం ఎలాగంటే?

ఇదిలాఉండగా INS ఉదయగిరిని ముంబయిలోని మజగాన్ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్ (MDL) నిర్మించింది. అలాగే INS హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్‌-ఇంజినీర్స్‌ (GRSE) తయారుచేసింది. ఈ యుద్ధనౌకల్లో ఆధునిక డీజిల్/గ్యాస్ కంబైన్డ్‌ ప్రొపల్షన్ ప్లాంట్లు, అడ్వాన్స్‌డ్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ అలాగే స్వదేశీ సాంకేతికతో తయారు చేసిన అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ల సూట్లు అమర్చార్‌. ఈ నౌకలు సముద్ర జలాల్లో్ నిర్దేశిత లక్ష్యాలను 100 శాతం ఛేదించగల సామర్థ్యం ఉండటం మరో విశేషం. 

Also Read: ఉద్యోగం కోసం ఇక అమెరికా పోలేరు.. భారతీయులకు ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్

Advertisment
తాజా కథనాలు