Business: SBI క్రెడిట్ కార్డు వాడే వారికి అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి!

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డ్, ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్, ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ వంటి క్రెడిట్ కార్డులపై లభించే రివార్డు పాయింట్లు తగ్గుతాయి.

New Update
SBI credit card

SBI credit card

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు వివిధ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడినవి. షాపింగ్, ప్రయాణాలు, ఇంధనం, లైఫ్‌స్టైల్ వంటి విభాగాల్లో అనేక ఆఫర్లు, రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. ఎస్‌బీఐ కార్డ్‌తో మీరు అపరిమితమైన లాభాలు పొందవచ్చు. ఇది ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా.. మీ ఖర్చులను సులభతరం చేస్తుంది. సురక్షితమైన లావాదేవీలు, సులభమైన EMI ఆప్షన్లతో.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. అయితే తాజాగా SBI క్రెడిట్ కార్డును ఉపయోగించే వారికి.. సెప్టెంబర్ 1 నుంచి నియమాలు మారుతున్నట్లు తెలుస్తోంది. మీకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు  వాడినట్లు అయితే.. వాటి ప్రయోజనాలు, నియమాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్:

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. వచ్చే నెల సెప్టెంబర్ 1, 2025 నుంచి SBI కార్డుల నిబంధనలలో అనేక కీలక మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు కార్డ్ హోల్డర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డ్, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ వంటి క్రెడిట్ కార్డులపై లభించే రివార్డు పాయింట్లు తగ్గుతాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై ఇకపై ఎలాంటి రివార్డు పాయింట్లు లభించవు. అలాగే వ్యాపారుల లావాదేవీలకూ ఈ నియమం వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: ఉద్యోగులకు డెంట్సు బిగ్ షాక్..  3,400 మంది ఔట్!

సెప్టెంబర్ 16, 2025 నుంచి అన్ని కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు వాటి పునరుద్ధరణ తేదీల ప్రకారం అప్‌డేట్ చేయబడిన ప్లాన్‌లకు మార్చబడతాయి. ఈ మార్పు గురించి ఎస్‌బీఐ కార్డులు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా 24 గంటల ముందుగా తెలియజేస్తాయి. ఈ మార్పులు క్రెడిట్ కార్డ్ నియమాలలో ఎస్‌బీఐ తీసుకువస్తున్న వరుస మార్పులలో భాగమే. ఇప్పటికే జులై, ఆగస్టు నెలల్లో వివిధ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై లభించే 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఉన్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ కవరేజీని నిలిపివేశారు. ఈ మార్పు ఎస్‌బీఐ ఎలైట్, ఎస్‌బీఐ ప్రైమ్ కార్డ్ వినియోగదారులందరికీ వర్తిస్తుంది. ఈ నిబంధనల మార్పులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ వాడకాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ల్యాంచ్ చేసిన ఈ-కారు.. ప్రత్యేకతలేంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు