Telangana: కాళేశ్వరం విచారణ.. ఛలో BRK భవన్కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే..
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించింది. నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో గోపీనాథ్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత అజహరుద్దీన్, నవీన్ యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లుగా దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేపు బిగ్ డే. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. కేసీఆర్ ను విచారిస్తే దాదాపుగా విచారణ పూర్తి అవుతుంది.
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై కీలక అప్డేట్ వచ్చింది. జులై మొదటివారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆగస్టు 14లోపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40KM వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది.
సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడంలేదని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కిరణ్కు 5ఏళ్ల క్రితం లవ్మ్యారేజ్ అయింది. ఈమధ్య ఇద్దరికీ మనస్పర్థాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.
తెలంగాణ మంత్రివర్గంలోకి సామాజిక వర్గాల వారీగా అవకాశం కల్పించారు. ముగ్గురు మంత్రులు ఈరోజు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే నలుగురు రెడ్డీ మంత్రులు ఇండటంతో ఆసారి రెడ్లకు కాకుండా.. బీసీ, ఎస్సీ మాల, మాదిగ ఎమ్మెల్యేలకు అవకాాశం కల్పించారు.
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి MLC అమీర్ అలీఖాన్ లకు మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. రాజ్ భవన్లో ఆదివారం వీరి పేర్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆశలు పెట్టుకున్న పలువురికి నిరాశే మిగిలింది.