Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌తో సెలబ్రిటీల కుటుంబాల్లో చిచ్చు: మహేశ్‌ కుమార్ గౌడ్

కేసీఆర్, కేటీఆర్‌కు తెలియకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ జరగదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సినీతార ఫోన్‌ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపణలు చేశారు.

New Update
TPCC Chief Mahesh Kumar Goud

TPCC Chief Mahesh Kumar Goud

హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఛానెల్‌పై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో కేటీఆర్‌ పేరును ప్రస్తావించి కథనాలు ప్రసారం చేయడంతో ఆగ్రహించిన కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడ్డారు. దీన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్, కేటీఆర్‌కు తెలియకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ జరగదని అన్నారు. సినీతార ఫోన్‌ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపణలు చేశారు. 

Also Read: ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం.. తండ్రిపై కేసు నమోదు

Mahesh Kumar Goud Comments On Phone Tapping Case

సినీ తారలు, మహిళా అధికారులు, జడ్జిల ఫోన్‌లు కూడా ట్యాప్‌ చేశారని విమర్శించారు. వాళ్లు నేతలను టార్గెట్‌ చేయాలనుకుంటే వారి ఇంట్లో ఉండే మహిళల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని నిలదీశారు. ఏదైనా అభ్యంతరం ఉంటే న్యాయపరంగా ముందుకెళ్లాలని హితువు పలికారు. ఇందిలాఉండగా మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఎండీ వంశీ తీవ్రంగా స్పందించారు. ఫ్యాన్ ట్యాపింగ్ విషయాలను బయట పెట్టే ప్రయత్నం చేసినందుకు పెద్ద ఇనుప రాడ్డులు, బండరాయిలతో కార్లు మీద దాడి చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఏమైవుతుంది? మీడియా స్వేచ్ఛ ఏమవుతుంది? మమ్మల్ని చంపేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: విమాన ప్రమాదంలో కుట్రకోణం.. కేంద్రం దర్యాప్తు!

 ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎక్స్‌లో స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని అన్నారు. బీఆర్‌ఎస్‌ సోదరులు సంయమనం పాటించాలని అన్నారు. '' ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు. అలానే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదు. కానీ ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చాడు మన గుంపు మేస్త్రి, అతని అనుంగ మిత్రులు. న్యాయ విధానాన్ని నమ్ముకుందాం. మీ బాధను, పార్టీపై, నాపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలను. ఇలాంటి బురదజల్లే ప్రయత్నాలపై కోర్టును ఆశ్రయిస్తామంటూ'' కేటీఆర్‌ రాసుకొచ్చారు. 

Also Read :  రోడ్డు పక్కన బుట్టలో నవజాత శిశువు.. లేటర్‌లో ఏం రాశారంటే ?

Also Read :  Kannappa Movie Second Day Collections: ఆ సినిమాలను దాటేసిన కనప్ప సెకండ్ డే కలెక్షన్లు!

 

telangana | phone tapping case | Phone Tapping | mahesh kumar goud

Advertisment
Advertisment
తాజా కథనాలు