Insta Reel : రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కుటుంబం బలి!
సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో రైలుపట్టాలపై స్టంట్ చేసిన ఓ కుటుంబం దుర్మరణం చెందింది. యూపీ లహర్పూర్కు చెందిన దంపతులు మహ్మద్ అహ్మద్, నజ్రీన్.. కొడుకు అబ్దుల్లాను లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. శరీరాలు ఛిద్రమయ్యాయి.