/rtv/media/media_files/2024/12/11/C0JgrCnhcQB46bD0J1L4.jpg)
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ యూట్యూబ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ మరింత పెంచుకునేందుకు యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది. ఇప్పటికి చాలానే ఫీచర్లు అందించింది. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read : మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!
కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ కళ్లు చెదిరే ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే ‘‘ఆటో డబ్బింగ్’’ ఫీచర్. ఇది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయానికొస్తే.. ఈ ఫీచర్ ద్వారా క్రియేట్ చేసిన కంటెంట్‌ను ఇతర భాషల్లోనూ వినిపించొచ్చు.
Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు
ఆటో డబ్బింగ్ ఫీచర్
దీనర్థం ఏంటంటే.. వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేరే భాషల్లోకి మార్చి వినిపిస్తుంది. అలాగే భాషా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా వీడియోలను ఇతర భాషల్లో పోస్ట్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇతర భాషల్లోని వీడియో కంటెంట్‌ను మనకు నచ్చిన భాషల్లో చూడొచ్చు.
Also Read : 'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..!
ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను హిందీ, జర్మన్, ఫ్రెంచ్, ఇండోనేషియన్, పోర్చుగీస్, ఇటాలియన్, స్పానిష్ వంటి భాషల్లోకి ఆటో మేటిక్‌గా డబ్ చేస్తుంది. అదే సమయంలో పైనున్న ఏ భాష వీడియో కంటెంట్‌ని అయినా ఇంగ్లిష్‌లోకి మారిపోతుంది. ఇక కంటెంట్ క్రియేటర్ల నుంచి ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు యూట్యూబ్ పేర్కొంది.
Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!