అనసూయ భరద్వాజ్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. 40 ఏళ్ల వయసులోనూ ఎక్కడా తగ్గడం లేదు. యాంకర్‌గా, పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో, చిన్న చిన్న సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్‌లో చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఇది కూడా చూడండి: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత
మరోవైపు కొన్ని వివాదాల్లో సైతం చిక్కుకుంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంది. అనేక ఆసక్తికర సంఘటనలు, మలుపులు చోటుచేసుకున్నాయి. ఇటీవలే భారీ బడ్జెట్ సినిమాలో నటించింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ సినిమాలో మరోసారి దాక్షాయణిగా అదరగొట్టేసింది.
ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి
ఆమె యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. నెగెటివ్ పాత్రలో కనిపించి అదరగొట్టేసింది. ఇలా ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యక్తిగత ఒడుదుడుకులతో అనసూయ కెరీర్ సాగుతోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అనసూయ మరోసారి తల్లి కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దానికీ ఓ కారణం ఉంది.
ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!
అందుకే బిడ్డను కంటా
ఎందుకంటే అనసూయ తండ్రికి ముగ్గురూ ఆడపిల్లలే. అందువల్ల తనకు పెళ్లైన తర్వాత ఫస్ట్ అబ్బాయి, రెండో సారి అమ్మాయి పుట్టాలని గట్టిగా కోరుకుందట. ఆమె అనుకున్నట్లుగానే మొదట అబ్బాయి పుట్టాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. కానీ ఆ తర్వాత కూడా రెండో సంతానంగా అబ్బాయే పుట్టడంతో ఒకింత నిరాశ చెందిందట.
ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
దీంతో కూతురు కోసం అనసూయ మరో సారి తల్లి కావడానికి రెడీ అంటున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్లు అయినా పర్వాలేదు.. ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదు అంటున్నట్లు సమాచారం. ఎవరు ఏం అనుకున్నా అమ్మాయిని కనేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానంటు చెబుతున్నట్లు తెలిసింది. అయితే వ్యాఖ్యలన్నీ గతంలో ఓ ఇంటర్వ్యూలో అనసూయ చేసింది. ఇప్పుడు మరోసారి ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.