IG: ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేశారా?.. అందుకే ఇన్‌స్టాలో వ్యూస్ రావడం లేదు! ఇన్‌గ్రామ్‌లో రీల్స్‌కి వ్యూస్ రావాలంటే ఈ నాలుగు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. లేదంటే ఎన్ని వీడియోలు చేసినా ఫలితం ఉండదు. మీడియా అప్‌లోడ్ క్వాలిటీ, రికమెండెడ్ రీల్స్ ఆన్ ఫేస్‌బుక్, షెడ్యూల్డ్ కంటెంట్, అకౌంట్ స్టేటస్ ఆన్ చేసుకోవాలి. అప్పుడే వ్యూస్ వస్తాయి. By Seetha Ram 29 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి నేటి యువత ఎక్కువగా సోషల్ మీడియాలోనే మునిగితేలుతుంది. అందులో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటుంది. పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ.. చేస్తూ కాలం గడిపేస్తున్నారు. బాగా వైరల్ కావాలనే ఉద్దేశ్యంతో రోజుకు చాలా వీడియోలు చేస్తున్నారు. కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువగా రావడంతో నిరాశ చెందుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్! అలాంటి వారికి గుడ్ న్యూస్. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి వ్యూస్ ఎలా రాబట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్లారిటీ వీడియోలు చేయడమే కాదు. దాన్ని ఏ సమయంలో అప్లోడ్ చేయాలి అని కూడా తెలియాలి. అంతేకాదు.. ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ ఆఫ్ చేసి ఉంటే కూడా వ్యూస్ రావు. ఇప్పుడు అవేంటో.. వాటిని ఎలా ఆన్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇన్‌స్టా రీల్స్ వైరల్ కావాలంటే ఈ సెట్టింగ్స్ ‘మీడియా అప్‌లోడ్ క్వాలిటీ’ ముందుగా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. అక్కడ సెట్టింగ్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఓపెన్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ‘డేటా యూసేజ్ అండ్ మీడియా క్వాలిటీ’ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ‘మీడియా అప్‌లోడ్ క్వాలిటీ’ అనే ఆప్షన్ చాలా మంది ఫోన్లలో ఆఫ్‌లో ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకోవాలి. అలా చేసుకోలేదంటే ఎంత క్లారిటీ వీడియో అయినా పోస్ట్ చేసిన తర్వాత కంప్రస్ అయి బ్లర్‌గా కనిపిస్తుంది. అందువల్ల మీరు ఎన్ని వీడియోస్ చేసినా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఎక్కువగా క్లారిటీ వీడియోలనే రికమండ్ చేస్తుంది కాబట్టి. ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ! ‘క్రాస్ పోస్టింగ్’ ఇంకో మెయిన్ సెట్టింగ్ ఉంది. మళ్లీ సెట్టింగ్ అండ్ ప్రైవసీ క్లిక్ చేసి ‘క్రాస్ పోస్టింగ్’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ‘రికమెండెడ్ రీల్స్ ఆన్ ఫేస్‌బుక్’ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఆఫ్ చేసి ఉంటే రీల్ కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటుంది. ఆన్ చేస్తే ఫేస్‌బుక్‌లో రీల్స్ చూసే వారికి కూడా మీ ఇన్‌స్టా రీల్ చేరుతుంది. దీంతో వ్యూ కౌంట్ అవుతుంది. అక్కడ లైక్ చేసినా ఇన్‌స్టా లైక్‌గానే కౌంట్ అవుతుంది. అలాగే వారు కామెంట్ చేయాలన్నా అది నేరుగా ఇన్‌స్టాలోకి రీడైరెక్ట్ అవుతుంది. దీనివల్ల వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. Also Read : హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్ ‘షెడ్యూల్డ్ కంటెంట్’ ముందుగా సెట్టింగ్‌లోకి వెళ్లి అక్కడ ‘షెడ్యూల్డ్ కంటెంట్’ అనే ఆప్షన్ ఉంటుంది. దీనర్థం ఏంటంటే.. మనం పెట్టే వీడియోలు ఏ సమయంలో పెడితే ఆ సమయంలో క్లిక్ అవ్వవు. దానికంటూ ఓ సమయం ఉంటుంది. 5.30pm లేదా 5.37 pm లేదంటే 9.31am, 9.37am ఇలా ఆడ్ టైమింగ్స్‌లో అప్‌లోడ్ చేయాలి. అందువల్ల కరెక్ట్ టైమ్‌లో అప్లోడ్ చేయాలంటే షెడ్యూల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా అదే అప్లోడ్ అయిపోతుంది. ఒకవేళ సెట్టింగ్‌లో షెడ్యూల్ అనే ఆప్షన్ లేకపోయితే.. వీడియో పోస్ట్ చేసేటప్పుడు కిందన స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. Also Read : బ్లాక్ బాడీకాన్ అవుట్ ఫిట్ లో..చేతిలో అది పట్టుకొని తమన్నా హాట్ ఫోజులు ‘అకౌంట్ స్టేటస్’ సెట్టింగ్ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్లి.. కిందికి స్క్రోల్ చేస్తే ‘అకౌంట్ స్టేటస్’ ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలా ఆప్షన్‌లు కనిపిస్తాయి. అవన్నీ గ్రీన్ కలర్‌లో రైట్ టిక్ మార్క్‌తో ఉండాలి. అలా ఉంటే ఎలాంటి ఇష్యూస్ లేవని అర్థం. అలా లేకుండా ఎస్క్లమేషన్ మార్క్ రెడ్ కలర్‌లో ఉంటే రీల్స్ అంత ఈజీగా వైరల్ అవ్వవు. కంటెంట్ కొన్ని నెలల వరకు కూడా రీచ్ కాదు. అందువల్ల మీరు చేసే వీడియో చాలా మందికి రీచ్ కావాలంటే ఆ ఆప్షన్‌లు గ్రీన్ రైట్ మార్క్‌తో ఉండాలి. #instagram-ai-feature #social-media #instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి