Sajjala Bhargav: సజ్జల భార్గవ్ అరెస్ట్?.. కోర్టు ఏం చెప్పబోతోంది

AP: సజ్జల భార్గవ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని భార్గవ్‌ పిటిషన్లు వేశారు. కాగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తే పోలీసులు భార్గవ్‌ను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
SAJJALA BHARGAV

Sajjala Bhargav : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించారనే కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి సజ్జల భార్గవ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేయగా.. అరెస్ట్ నుంచి తప్పించేందుకు సజ్జల భార్గవ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే పోలీసులు సజ్జల భార్గవ్ ను అరెస్ట్ చేయనున్నట్టు సమాచారం. 

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

ఆర్జీవీ అరెస్ట్ కు కూడా...

గత ఏడాది సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా పెట్టిన మార్ఫ్ చేసిన ఫొటోపై టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి బయటపడేందుకు ఆర్జీవీ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు కోర్టులో విచారణకు ఆర్జీవీ బెయిల్ పిటిషన్ ఉండగా.. ప్రకాశం పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వచ్చారు. ఆర్జీవీ పరారీలో ఉన్న క్రమంలో పోలీసులు వేణుతిరిగారు. ఇదిలా ఉంటే నిన్న ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈరోజుకి వాయిదా వేసింది. కాగా ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే చర్చ, ఉత్కంఠ కొనసాగుతోంది. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Also Read : Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు