/rtv/media/media_files/2024/12/01/Gol153rtHK2lRKCbcR3n.jpg)
ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపున్న పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే మస్క్ చేసిన విమర్శలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఖండించారు. ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ యాక్సెస్‌ను నియంత్రించేందుకు ఈ సోషల్ మీడియా బ్యాన్ బ్యాక్ డోర్‌లా ఉందని ఎలాన్ మస్క్ విమర్శలు చేశారు.
Also Read: ట్రంప్ హయాంలో కశ్యప్ పటేల్‌కి కీలక బాధ్యతలు.. ఎవరతను?
Australia PM Albanese :
దీనిపై స్పందించిన ఆంటోనీ.. ''ఎలాన్ మస్క్ ఓ అజెండాను కలిగి ఉన్నారు. ఆయన ఒక ఎక్స్ సంస్థ ఓనర్. దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని'' పేర్కొన్నారు. సోషల్ మీడియా బ్యాన్‌పై ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇదిలాఉండగా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం గత బుధావారం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే బిల్లును సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు మొత్తం 102 మంది సభ్యుల ఓట్లతో ఆమోదం పొందింది. ఇక దీనికి సెనెట్ ఆమోదం తెలిపితే ఇది చట్టరూపం దాల్చనుంది.
Also Read: వామ్మో ఆఫీసులో కునుకు తీశాడని.. ఇన్ని లక్షలు ఫైన్ హా?
అయితే ఆయా ప్లాట్‌ఫామ్‌లో వయో పరిమితులు ఎలా అమలు చేస్తారన్న దానిపై ఓ ఏడాది వరకు సమయం ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్లపై 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.273 కోట్లకు పైగా) జరిమానా విధిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇదిలాఉండగా ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఈ బిల్లును సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
Also Read: కోర్టు సంచలన తీర్పు.. 141 ఏళ్లు జైలు శిక్ష.. ఎందుకంటే?
Also Read: రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే!