Tripura : వర్ష బీభత్సం.. 22 మంది మృతి!
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల త్రిపురలో సుమారు 22 మంది మృతి చెందారు. మరో 10 మంది ఆచూకీ లేకుండా పోయారు. రాష్ట్రంలోని 450 సహాయ శిబిరాల్లో 65,400 మంది ఆశ్రయం పొందుతున్నారని అధికారి ఒకరు తెలిపారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల త్రిపురలో సుమారు 22 మంది మృతి చెందారు. మరో 10 మంది ఆచూకీ లేకుండా పోయారు. రాష్ట్రంలోని 450 సహాయ శిబిరాల్లో 65,400 మంది ఆశ్రయం పొందుతున్నారని అధికారి ఒకరు తెలిపారు.
తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను కాస్ తిరస్కరించిన తర్వాత మొదటిసారిగా స్పందించింది వినేశ్ ఫోగాట్. చాలా ఆవేదనకు గురైయ్యానని చెబుతూ నేల మీద పడుకుని భావోద్వేగానికి గురైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ కు జాబ్ ఆఫర్ ఇచ్చారు. తాజాగా మస్క్.. ట్రంప్ ను ఎక్స్ వేదికగా ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో మస్క్ ట్రంప్ ను పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలోనే తన ప్రభుత్వంతో కలిసి పని చేస్తారా అంటూ ట్రంప్ మస్క్ ను అడిగారు.
ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై మళ్లీ కదలిక వచ్చింది. అయితే.. కేంద్రం తేనున్న కఠిన నిబంధనలతో ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సోషల్ మీడియాపై ఆధారపడి నడిచే వార్తా సంస్థలకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఉభయగోదావరి జిల్లాల్లో గల్ఫ్ దేశాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చెందిన తాటి సంకురమ్మ గల్ఫ్ లో తన పడుతున్న బాధను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ తనను రక్షించాలని వేడుకుంది.
ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు మాంసాహార వంటకం డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఓ యువకుడు ఏకంగా తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి రీల్ గురించి సెంట్రల్ రైల్వే.. ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలంటూ రైల్వేశాఖ కోరింది.
పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కింది.ఈ షాకింగ్ ఘటన గల్ఫ్ దేశం కువైట్ లో జరిగింది.పెళ్లి అయిన మూడు నిమిషాలకే వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని విసుక్కున్నాడు.దీంతో ఆ యువతి వెంటనే విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించి..విడాకులు పొందింది.
కర్ణాటకలోని ఉడిపిలో కుమార్తె ప్రైవేటు వీడియోలను తీసిన సొంత తండ్రే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వేరే యువకుడిని కూతురు ప్రేమించడంతోనే ఆ తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు.