Viral Video : సాధారణంగా గజరాజులు దూసుకొచ్చాయంటే గజగజ వణకడం ఖాయం. కానీ ఓ ఏనుగు మాత్రం మర్యాదలో తగ్గేదే లే అంటోంది. తన దారికి అడ్డుగా వచ్చిన ఓ వ్యక్తిని పక్కకి వెళ్లమని వినయంతో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌లో ఏనుగు ప్రశాంతంగా మనిషికి సంకేతాలు ఇస్తూ తన దారి నుంచి పక్కకు తప్పుకోవాలని గుర్తు చేస్తుంది. Also Read : ఆరోగ్యానికే కాదు అందానికి స్మార్ట్‌ఫోన్ దెబ్బె సింపుల్‌గా తన కాలితో.. వ్యక్తి ఒక ఇంటి ముందు దారిలో నిలబడ్డాడు. అంతలోనే ఓ పెద్ద ఏనుగు వెనుకవైపు నుంచి వచ్చింది. అది గమనించని వ్యక్తి అలాగే దారిలో నిలబడి ఉన్నాడు. దగ్గరి దాకా వచ్చిన ఏనుగు... అతడిని ఏమీ చేయలేదు. అలాగని ఎలాంటి ధ్వని కూడా చేసి భయపెట్టలేదు. సింపుల్‌గా తన కాలితో కింద మట్టిని కాస్త ముందుకు తన్నింది. తన పక్కనుంచి మట్టి ఎగిసిపడటం చూసిన వ్యక్తి... ఇదేమిటా అని వెనక్కి తిరిగి చూశాడు. ఏనుగు కనబడటంతో భయపడి ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. Also Read : ఈ వ్యాధి కారణంగానే జాకీర్ హుస్సేన్ చనిపోయాడు Elephant gently reminding the human that he is in the way. pic.twitter.com/Ft6P7ICUf8 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) December 14, 2024 Also Read : పిల్లలు సన్నగా ఉన్నారా.. ఈ చిట్కాలు పాటించండి ఆ ఏనుగు హాయిగా తన దారిన తను వెళ్లిపోయింది. ట్విట్టర్‌లో ఓ వినియోగదారుడు పోస్ట్ చేసిన 23 సెకన్ల వీడియో ఎంతో మంది హృదయాలు గెలుచుకుంది. ఏనుగు పాటించిన మర్యాదను చూసిన నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఏనుగు ప్రవర్తనను వన్యప్రాణుల సాత్విక స్వభావాన్ని గుర్తుగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి జంతువుల నుంచి మనం మానవులం చాలా నేర్చుకోవాలని, అందుకే ఏనుగులు నాకు ఇష్టమైన జీవులు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. Also Read: ఉదయాన్నే పసుపు నీరు తాగితే అనేక వ్యాధులు దూరం.. వారం చూడండి