AP News : ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు ప్రేమ జంట వ్యవహారంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరుకు చెందిన యువకుడు, గుంటూరుకి చెందిన యువతి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకున్నారు ప్రేమ జంట. అయితే ఆ యువతికి మరొకరితో వివాహమైనట్లు తెలుస్తోంది. పరస్పరం ఘర్షణ: ఈ నేపథ్యంలో యువతి కొన్ని రోజుల క్రితం తాళ్లూరు వచ్చి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి తాళ్లూరు యువకుడి ఇంటికి వెళ్లారు. మా కుమార్తెను అప్పగించాలని కుటుంబ సభ్యులతో గొడవ పడ్డారు. అయితే..ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో.. వారంతా వచ్చి యువతి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అందరూ పరస్పరం ఘర్షణకు దిగారు. గుంటూరు యువతి తరఫున వచ్చిన కార్లను గ్రామస్థులు ధ్వంసం చేశారు.ఇది కూడా చదవండి: శేషాచలం అడవుల్లో విద్యార్థుల మిస్సింగ్..సెల్ ఫోన్ ఆధారంగా గాలింపు నాలుగు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా.. రెండు కార్లతో వారు తప్పించుకున్నారు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తాళ్లూరు ఘర్షణ ప్రాంతానికి చేరుకున్నారు. వారిలో కొందరిని వత్సవాయి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్‌ఐ వెల్లడించారు. ఇది కూడా చదవండి: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే ఆర్టీసీ బస్సు బీభత్సం: విజయవాడలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. గవర్నర్‌పేట డిపోకు చెందిన సిటీ బస్సు హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడకు వెళ్తోంది. విజయవాడకు వెళ్తున్న సమయంలో ఆకస్మాత్తుగా బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఓ కార్ల షోరూమ్‌లోకి దూసుకెళ్లటంతో కోట్ల విలువైన కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో విజయవాడ ప్రజలు భయాందోళకు గురైయ్యారు.ఇది కూడా చదవండి: రోజూ ఈ సమయంలో యాపిల్ తింటే ఎన్నో లాభాలు