''సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం'' అమరావతిలో హోర్టింగ్స్‌

లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

New Update
Hoarding at Amaravati

Hoarding at Amaravati

ఈ మధ్యకాలంలో అందరి చేతిల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతీరోజు కొన్ని గంటల పాటు యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ లాంటి యాప్‌లను వాడకుండా ఎవరూ ఉండలేరు. సోషల్ మీడియాలో నిత్యం వివిధ రకాల కంటెంట్‌, వాటికి సంబంధించిన వీడియోలు వస్తుంటాయి. అయితే అందులో కొన్ని నిజమైనవి ఉంటే మరికొన్ని తప్పుడు ప్రచారాలు ఉంటాయి. అలాగే అసభ్యకర వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, అసభ్యకరమైన వీడియోలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతమైన అమరావతిలో కీలక పరిణామం చోటుచేసుకంది. 

Also Read: మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్‌పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు..

సోషల్ మీడియా దుష్ప్రచారంపై అవగాహన కల్పిస్తూ హోర్టింగ్‌లు దర్శనమిచ్చాయి. '' సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం. చెడు పోస్టు చేయవద్దు. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్థి పలుకుదాం'' అనే క్యాప్షన్లతో బోర్డులు పెట్టారు. అందులో మూడు కోతులు కూర్చొని ఉన్నాయి. చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అనే ఫోజులు ఇచ్చాయి. మరో కోతి వాటి వెనకాల నిలబడి 'పోస్ట్‌ నో ఈవిల్' అనే బోర్డును పట్టుకుంది.       

Also Read: BNSL నుంచి ఫ్రీ OTT : 300 ఛానల్స్, మూవీస్, వెబ్ సిరీస్ ఎంజాయ్

 ఈ హోర్డింగ్‌లు అమరావతితో పాటు.. గుంటూరు, విజయవాడ లాంటి నగరాల్లో కూడా పెట్టారు. సోషల్ మీడియాపై అవగాహన పెంచేలా ఏర్పాటు చేసిన ఈ హోర్టింగ్‌లు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం.. సోషల్‌ మీడియా దుర్వినియోగంపై కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు కూడా అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లని, ముఖ్యంగా మహిళలను వేధించేవాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పనులకు పాల్పడ్డవారిలో ఇప్పటికే పలువురు జైలుశిక్ష కూడా అనుభవించారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు ఇలా హోర్డింగ్‌లు పెట్టి అవగాహన కల్పించడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు